Lovers Accident Video: ప్రియురాలి అత్యుత్సాహం.. రెండో అంతస్తులో పరుగెత్తుకుంటూ రావడంతో..
ABN, Publish Date - Aug 10 , 2025 | 06:11 PM
21 ఏళ్ల యువతి తన 27 ఏళ్ల ప్రియుడితో కలిసి రెండో అంతస్తులో ఉండగా విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో నుంచి ప్రియుడు బయటికి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతడి వెనుకే ప్రియురాలు కూడా పరుగెత్తుకుంటూ వచ్చింది. చివరకు ఏమైందో చూడండి..
మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. అప్పటిదాకా సంతోషంగా ఉన్న వారు సడన్‌గా ప్రాణాలు వదిలేస్తుంటారు. మరికొన్నిసార్లు అనూహ్యంగా ప్రమాదం ముంచుకొస్తుంటుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో ఇలాంటి సంఘటలన్నీ వీడియోల రూపంలో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రేమికులు రెండో అంతస్తులో ఉండగా విషాద ఘటన చోట చేసుకుంది. ప్రియురాలు పరుగెత్తుకుంటూ వచ్చి ప్రియుడిని పట్టుకుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. దక్షిణ అమెరికా (South America) పరిధి పెరూలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 21 ఏళ్ల యువతి తన 27 ఏళ్ల ప్రియుడితో కలిసి రెండో అంతస్తులో ఉండగా విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో నుంచి ప్రియుడు బయటికి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతడి వెనుకే ప్రియురాలు కూడా పరుగెత్తుకుంటూ వచ్చింది.
ఆమెను చూసి అతను నిలబడిపోయాడు. అయితే వేగంగా దగ్గరి వచ్చిన ఆమె.. అతన్ని పట్టుకుని మాట్లాకుంటూ ముందుకు తోసింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి రెండో అంతస్తు (Lovers fell from second floor) నుంచి కిందకు పడిపోయారు. ఈ ఘటనలో యువతి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికి చేరుకున్న స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది. యువకుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.
కాగా, ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘అయ్యో ఎంత ఘోరం జరిగింది’.. అంటూ కొందరు, ‘ఇంటి నిర్మాణంలో నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ప్రస్తుతం 3 వేల మందికి పైగా వీక్షించారు.
ఇవి కూడా చదవండి..
ఇళ్లల్లోకి పాములు రాకుండా ఉండాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి చాలు..
నిర్జీవంగా పడి ఉన్న భాగస్వామి.. గమనించిన హంస చివరకు ఏం చేసిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Aug 10 , 2025 | 06:43 PM