ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Stunt Viral Video: రైలు పట్టాలపై డేంజరస్ స్టంట్.. సజ్జన్నార్ ఏమన్నారంటే..

ABN, Publish Date - May 11 , 2025 | 12:11 PM

ఓ యువకుడి డేంజరస్ స్టంట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. రైలు పట్టాలపై యువకుడు చేసిన విన్యాసంపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. వీడియోను షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు..

ప్రస్తుతం చాలా వరకూ యువత ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ వ్యూస్, లైకులే టార్గెట్‌గా ఆలోచిస్తున్నారు. వ్యూస్ బాగా వస్తే సంబరపడుతుండగా, రాకపోతే ఆవేదనలో కూరుకుపోతున్నారు. కొన్నిసార్లు ఏకంగా ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. కొందరైతే ఎలాగైనా నెట్టింట ట్రెండింగ్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. తాజాగా, ఓ యువకుడి డేంజరస్ స్టంట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. రైలు పట్టాలపై యువకుడు చేసిన విన్యాసంపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. వీడియోను షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు రైలు పట్టాలపై బోర్లాపడుకుని ఉంటాడు. అతన్ని వారించాల్సిన స్నేహితులు.. అందుకు విరుద్ధంగా వీడియో తీస్తూ ఎంకరేజ్ చేస్తుంటారు. అంతలోనే ఎదురుగా రైలు దూసుకుంటూ వస్తుంటుంది. అయినా ఆ యువకుడు మూర్ఖంగా (Man sleeping on train tracks) అలాగే పడుకుని ఉంటాడు. తీరా రైలు దగ్గరికి రాగానే.. చేతులు ముందుకు పెట్టి బోర్లా పడుకంటాడు.

Marriage Funny Video: ఈ వరుడు చల్లగుండ.. ఊరేగింపులో ఎలా వస్తున్నాడో చూడండి..


వేగంగా వచ్చిన రైలు.. అతడి మీదుగా దూసుకెళ్లిపోతుంది. రైలు వెళ్లిపోగానే అతను పైకి లేచి, తానేదో గొప్ప పని చేసినట్లుగా గట్టిగా అరుస్తూ సంతోషంతో గెంతులేస్తాడు. ఈ వీడియో తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar) కంటపడింది. దీంతో ఆ వీడియోను తన ఎక్స్‌లో షేర్ చేశాడు. ‘‘ఫేమస్ కోసం ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడటం పిచ్చితనం, సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం విలువైన ప్రాణాలను పణంగా పెట్టాలా? ఏదో ఘనకార్యం వెలగబెట్టినట్లు ఆ పట్టరాని సంతోషం ఎందుకు.. ఇలాంటివి మీకు సరదాగా అనిపించొచ్చు.. కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఆలోచించండి’’.. అని ప్రస్తావిస్తూ వీడియోను షేర్ చేశారు.

Viral Video: చూడటానికే చేప.. దీని దంతాల పవర్ చూస్తే మతి పోవాల్సిందే..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘అంత ప్రతిభ ఉంటే దేశం కోసం ప్రాణాలు అర్పించాలి గానీ.. ఇలాంటి పనులు చేయడమేంటీ’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1500కి పైగా లైక్‌లు, 81 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 11 , 2025 | 12:11 PM