Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..
ABN , Publish Date - May 09 , 2025 | 01:26 PM
ఆకలితో ఉన్న ఓ కోతికి కొండ అంచున ఉన్న చెట్టుపై పండు కనిపిస్తుంది. అయితే ఆ పండు కొమ్మ చివరన ఉంటుంది. అయినా కోతి ఎలాగైనా ఆ పండును తినేయాలనే ఉద్దేశంతో చెట్టు ఎక్కేస్తుంది. చివరకు పండును ఎలా కోసిందో మీరే చూడండి..

కోతి చేష్టలు కొన్నిసార్లు తలనొప్పి తెప్పించినా.. అప్పుడప్పుడూ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. మరికొన్నిసార్లు అందరికీ గుణపాఠం నేర్పిస్తుంటాయి. కొన్నిసార్లు కోతులు ఎంతో క్లిష్ట సమయంలోనే ఎంతో తెలివిగా ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ కోతి విచిత్ర విన్యాసానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొమ్మ చివరన కూర్చున్న కోతి.. పండును కోసిన విధానం చూసి అంతా షాక్ అవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ కోతికి కొండ అంచున ఉన్న చెట్టుపై పండు కనిపిస్తుంది. అయితే ఆ పండు కొమ్మ చివరన ఉంటుంది. అయినా కోతి ఎలాగైనా ఆ పండును తినేయాలనే ఉద్దేశంతో చెట్టు ఎక్కేస్తుంది.
Viral Video: టెక్నిక్ మామూలుగా లేదుగా.. కాలువలో పడిపోయిన డబ్బులను ఎలా తీశాడో చూడండి..
అయితే కొమ్మ అంచుకు వెళ్లగానే కిందకు వంగుతుంది. దీంతో పండు కోయడం సాధ్యం కాదు. అయినా ఆ కోతి ఏమాత్రం నిరాశ పడకుండా పండును తెంపేందుకు ప్రయత్నిస్తుంది. చివరకు తన బుర్రకు పని చెప్పి.. కొమ్మను వేలాడి, కొమ్మ అంచును పూర్తిగా విరిచేసి తన చేతిలోకి తీసుకుంటుంది. ఇలా కొమ్మ అంచుకు వెళ్లకుండానే పండును (monkey cleverly cut the fruit) ఎంతో సులభంగా తెంచుకుంటుంది. ఇలా ఆ కోతి ఎంతో తెలివితో పండును కోయడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Robot Funny Video: సినిమా చూపించిన రోబో.. యజమానిని ఎలా భయపెట్టిందో చూస్తే..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కోతి తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ కోతిని ఆదర్శరంగా తీసుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా లైక్‌లు, 1.26 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Woman Viral Video: వాగుపై విన్యాసాలు చేస్తూ రీల్స్.. చివరకు ఈ యువతికి ఏమైందో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Woman Funny Video: కాళ్లను ఇలా ఎవరైనా కడుగుతారా.. ఈ యువతికి చివరికి ఏమైందో చూస్తే..
Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..