Share News

Robot Funny Video: సినిమా చూపించిన రోబో.. యజమానిని ఎలా భయపెట్టిందో చూస్తే..

ABN , Publish Date - May 08 , 2025 | 08:11 AM

ఓ ఫ్యాక్టరీలో కొందరు రోబోలను తయారు చేస్తుంటారు. ఇద్దరు వ్యక్తులు నిలబడి రోబోను తయారు చేస్తుంటారు. ఓ వ్యక్తి కంప్యూటర్‌లో ఏదో చూస్తుండగా.. మరో వ్యక్తి అతడి సూచనల ఆధారణంగా రోబోకు వైర్లు అమర్చుతుంటాడు. ఇంతలో ఉన్నట్టుండి ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది..

Robot Funny Video: సినిమా చూపించిన రోబో.. యజమానిని ఎలా భయపెట్టిందో చూస్తే..

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో వంద మంది మనుషులు చేసే పనులను ఒక్క రోబో చేసిపడేస్తోంది. హోటళ్లో సప్లయర్ల దగ్గర నుంచి వైద్యం చేసే డాక్టర్ల వరకూ రోబోలను వినియోగించడం చూస్తున్నాం. అయితే టెక్నాలజీతో ఎంత మేలు కలుగుతుందో.. అజాగ్రత్తగా ఉండడం వల్ల కొన్నిసార్లు అంతే స్థాయిలో నష్టం కూడా జరుగుతుంటుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలను కూడా నిత్యం నెట్టింట చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. రోబోను తయారు చేస్తున్న సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. యజమానిని భయపెట్టిన రోబోను చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఫ్యాక్టరీలో కొందరు రోబోలను (Robot) తయారు చేస్తుంటారు. ఇద్దరు వ్యక్తులు నిలబడి రోబోను తయారు చేస్తుంటారు. ఓ వ్యక్తి కంప్యూటర్‌లో ఏదో చూస్తుండగా.. మరో వ్యక్తి అతడి సూచనల ఆధారణంగా రోబోకు వైర్లు అమర్చుతుంటాడు.

Bull Viral Video: పేరుకే ఎద్దు.. ప్రవర్తనలో కాదు.. నీళ్లు ఎలా తాగుతుందో చూస్తే..


అయితే ఇంతలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. అప్పటి దాకా కామ్‌గా ఉన్న రోబో.. ఒక్కసారిగా చేతులను పైకి, కిందకు వేగంగా ఊపుతుంది. దీంతో అక్కడున్న ఇద్దరూ భయంతో దూరంగా పరుగులు తీస్తారు. మరోవైపు ఆ రోబో చేతులు ఊపుతూనే స్టాండ్‌ను కూడా లాక్కుంటూ ముందుకు కదులుతుంటుంది. దీంతో చివరకు దాని యజమాని వెనుకగా వెళ్లి స్విచ్ ఆఫ్ చేస్తాడు. దీంతో ఆ రోబో ఎట్టకేలకు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. ఎట్టకేలకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Theft Funny Video: నేలపై పడిపోయిన ఫోన్.. తీసుకోవాలని చూడగా షాక్.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..


ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘దేవుడు మనిషిని సృష్టిస్తే.. మనిషి రోబోను సృష్టించాడు.. ఈ రోబో చివరకు మనిషిని ఏం చేస్తుందో ఏమో’’.. అంటూ కొందరు, ‘‘యజమానికి చుక్కలు చూపించిన రోబో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1800కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Marriage Funny Video: పెళ్లిలో అతిథులకు వింత కష్టం.. ఏం చేస్తున్నారో చూస్తే నవ్వు ఆపుకోలేరు..


ఇవి కూడా చదవండి..

Woman Funny Video: కాళ్లను ఇలా ఎవరైనా కడుగుతారా.. ఈ యువతికి చివరికి ఏమైందో చూస్తే..

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 08 , 2025 | 08:11 AM