Woman Viral Video: వాగుపై విన్యాసాలు చేస్తూ రీల్స్.. చివరకు ఈ యువతికి ఏమైందో చూస్తే..
ABN , Publish Date - May 09 , 2025 | 10:46 AM
ఓ యువతి రీల్స్‌లో ఫేమస్ అయ్యేందుకు ప్రమాదకర విన్యాసాలు చేసేందుకు సిద్ధపడింది. అది కూడా పొంగిపొర్లుతున్న వాగుపై విన్యాసాలు చేసేందుకు వెళ్లింది. కెమెరా ఆన్ చేసిన ఆమె.. వాగుపై ఉన్న కొమ్మపై కాళ్లు , చేతులు మోపి.. నడుము పైకి ఎత్తి విచిత్ర విన్యాసం చేసింది. చివరకు ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

యువతలో రీల్స్ పిచ్చి రోజురోజుకూ ముదిరిపోతోంది. ఎలాగైనా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు ప్రమాదకర విన్యాసాలు చేసేందుకూ వెనుకాడడం లేదు. మరికొందరు ప్రాణాలు పోతాయని తెలిసినా డేంజరస్ స్టంట్స్ చేసేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ఈ క్రమంలో కొందరు ఊహించని ప్రమాదాల్లో చిక్కుకోవడం చూస్తున్నాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి వాగుపై విన్యాసాలు చేస్తుండగా ఉన్నట్టుండి అనూహ్య ఘటన చోటు చేసుకుంది. చివరకు ఏమైందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి రీల్స్‌లో ఫేమస్ అయ్యేందుకు ప్రమాదకర విన్యాసాలు చేసేందుకు సిద్ధపడింది. అది కూడా పొంగిపొర్లుతున్న వాగుపై విన్యాసాలు చేసేందుకు వెళ్లింది.
Jugaad Viral Video: డ్రిల్లింగ్ మిషన్‌తో గ్రైండింగ్.. ఐడియా మామూలుగా లేదుగా..
కెమెరా ఆన్ చేసిన ఆమె.. వాగుపై ఉన్న కొమ్మపై కాళ్లు , చేతులు మోపి.. నడుము పైకి ఎత్తి విచిత్ర విన్యాసం చేసింది. ఈ క్రమంలో కాలు, చేయి పైకి ఎత్తి స్టంట్స్ చేయడానికి ప్రయత్నించింది. అయితే చేయి పైకి ఎత్తగానే ఒక్కసారిగా కొమ్మ పైనుంచి ధబేల్‌మని (young woman washed away in water) కిందపడి నీటిలో కొట్టుకుపోయింది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఆ తర్వాత యువతికి ఏమైందనే విషయం తెలియాల్సి ఉంది.
Robot Funny Video: సినిమా చూపించిన రోబో.. యజమానిని ఎలా భయపెట్టిందో చూస్తే..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ప్రమాదకర రీల్స్ చేయాలని చూస్తే ఇలాగే అవుతుంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పిచ్చి పిచ్చి విన్యాసాలు చేయడం ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 80కి పైగా లైక్‌లు, 5 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: టెక్నిక్ మామూలుగా లేదుగా.. కాలువలో పడిపోయిన డబ్బులను ఎలా తీశాడో చూడండి..
ఇవి కూడా చదవండి..
Woman Funny Video: కాళ్లను ఇలా ఎవరైనా కడుగుతారా.. ఈ యువతికి చివరికి ఏమైందో చూస్తే..
Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..