Viral Video: టెక్నిక్ మామూలుగా లేదుగా.. కాలువలో పడిపోయిన డబ్బులను ఎలా తీశాడో చూడండి..
ABN , Publish Date - May 08 , 2025 | 11:06 AM
ఓ వ్యక్తి తన జేబులోని చిల్లర డబ్బులను కాలువలో పడేసుకుంటాడు. అయితే కాలువ నీటిలో చేయి పెట్టి వెతకడం ఇష్టం లేని అతను.. చుట్టూ ఏదైనా దొరుకుతుందేమో అని చూస్తాడు. కానీ అతడికి ఎలాంటి వస్తువూ కనిపించదు. చివరికి ఏం చేశాడో మీరే చూడండి..

కొందరు వివిధ రకాల వస్తువులతో చేసే వింత వింత ప్రయోగాలు అందరినీ ఆకట్టుకుంటుంటాయి. మరికొందరు పెద్ద పెద్ద పనులను సైతం అతి తెలివితో చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కాలువలో పడిపోయిన డబ్బులను బయటికి తీసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇది మామూలు బ్రెయిన్ కాదు బాబోయ్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన జేబులోని చిల్లర డబ్బులను (Coins that fell into canal) కాలువలో పడేసుకుంటాడు. అయితే కాలువ నీటిలో చేయి పెట్టి వెతకడం ఇష్టం లేని అతను.. చుట్టూ ఏదైనా దొరుకుతుందేమో అని చూస్తాడు. కానీ అతడికి ఎలాంటి వస్తువూ కనిపించదు. దీంతో చివరకు తన బుర్రకు పదునుపెడతాడు.
Marriage Funny Video: పెళ్లిలో అతిథులకు వింత కష్టం.. ఏం చేస్తున్నారో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
తన వద్ద ఉన్న పాలిథిన్ కవర్ (Polythene cover) తీసుకుని, అందులో నీళ్లు నింపేస్తాడు. ఆ తర్వాత నీళ్లతో నిండిన కవర్‌ను కాలువ నీటిలో పెడతాడు. కాలువలో ఒక వైపు నుంచి మరో వైపునకు కవర్‌ను నేలకు తాకిస్తూ వెళ్తాడు. ఇలా చేయడంతో చివరకు కాలువలో పడిన కాయిన్ నీళ్ల కవర్ మధ్యలో నుంచి కనిపిస్తుంది. దీంతో నీళ్ల కవర్‌లో చేయి పెట్టి, కాయిన్‌ను పట్టుకుంటాడు. తర్వాత కవర్‌లో సహా బయటికి తీసి, ఆ తర్వాత కాయిన్‌ను మంచి నీటితో శుభ్రం చేసి జేబులో వేసుకుంటాడు.
Bull Viral Video: పేరుకే ఎద్దు.. ప్రవర్తనలో కాదు.. నీళ్లు ఎలా తాగుతుందో చూస్తే..
ఇలా మురికి నీటిని తాకకుండానే తన డబ్బులను తీసుకున్న ఇతడి తెలివితేటలు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్.. ఇతడి తెలివితేటలు మామూలుగా లేవుగా’’.. అంటూ కొందరు, ‘‘మా వూరి కాలువలో ఇలాంటి ట్రిక్స్ పని చేయవు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 వేలకు పైగా లైక్‌లు, 2.93 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Robot Funny Video: సినిమా చూపించిన రోబో.. యజమానిని ఎలా భయపెట్టిందో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Woman Funny Video: కాళ్లను ఇలా ఎవరైనా కడుగుతారా.. ఈ యువతికి చివరికి ఏమైందో చూస్తే..
Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..