Viral Video: జలపాతం వద్ద ఈత కొడుతుండగా నీటిలోకి దూకిన పాము.. చివరికి జరిగింది చూస్తే షాకవ్వాల్సిందే..
ABN, Publish Date - Jun 15 , 2025 | 12:54 PM
చాలా మంది పర్యాటకులు జలపాతం వద్ద స్నానాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గానీ.. ఓ పెద్ద పాము నీటిలోకి దూసుకొచ్చింది. దాన్ని చూడగానే అంతా భయంతో పరుగులు తీశారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
పాములు కొన్నిసార్లు ఊహించని విధంగా ఎంట్రీ ఇస్తుంటాయి. పడుకుందామని ఫ్యాన్ ఆన్ చేస్తే.. దానిపై నుంచి హాయ్ అంటూ బుసలు కొడుతుంది. అలాగే మరికొన్నిసార్లు మంచం కింద నుంచి బయటికి వచ్చి భయపెడుతుంటాయి. ఇంకొన్నిసార్లు ఏకంగా షూలలో నుంచి బుసలుకొడుతుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. చాలా మంది జలపాతం వద్ద ఈత కొడుతుండుగా.. ఓ విష సర్పం లోపలికి దూసుకొచ్చింది. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం కెంప్టీ జలపాతం (waterfall) వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. చాలా మంది పర్యాటకులు జలపాతం వద్ద స్నానాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గానీ.. ఓ పెద్ద పాము నీటిలోకి దూసుకొచ్చింది.
పామును చూడగానే భయపడ్డ జనం.. దాన్ని అదిలించారు. దీంతో పాము కూడా భయపడి బయటికి వెళ్లాల్సింది పోయి.. (Snake Jumped into Middle of Crowd in Water) జనంలోకి దూసుకొచ్చింది. జనం మధ్యలోకి రావడంతో అక్కడున్న వారంతా భయంతో అటూ, ఇటూ పరుగులు తీశారు. వారి మధ్యలో నుంచి అటు వైపు గట్టుపైకి దూసుకెళ్తుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. చూస్తుంటేనే ఒళ్లు జలదరిస్తోంది’.. అంటూ కొందరు, ‘మనుషుల భయపడ్డారు.. పాము కూడా భయపడింది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2000కి పైగా లైక్‌లు, 2 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
దుకాణ యజమానితో ఫన్నీ గేమ్.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..
పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jun 15 , 2025 | 01:46 PM