ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rs 1 Crore Tech Salaries: భారత ఐటీ రంగంలో శాలరీలపై టెకీ పోస్టు.. నెట్టింట పెద్ద ఎత్తున చర్చ

ABN, Publish Date - May 06 , 2025 | 03:30 PM

భారత ఐటీ రంగంలో రూ.కోటి వార్షిక శాలరీ సర్వ సాధారణమైపోయిందా అని ప్రశ్నిస్తూ ఓ టెకీ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. సాఫ్ట్‌వేర్ నిపుణులు ఈ పోస్టుపై పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

Rs 1 Crore Tech Salaries

ఇంటర్నెట్ డెస్క్: భారత ఐటీ రంగంలో ప్రస్తుతం రూ.కోటి వార్షిక శాలరీలు సాధారణమంటూ ఓ వాల్‌మార్ట్ ఉద్యోగి నెట్టింట వ్యాఖ్యానించడం వైరల్‌గా మారింది. టెక్ రంగ నిపుణులు పరిశీలకుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది వాస్తవ పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశారు.

బ్లైండ్ అనే ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ వేదికగా ఓ వాల్ మార్ట్ ఉద్యోగి ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కేవలం 4 నుంచి 5 ఏళ్ల అనుభవం ఏటా రూ.కోటి సంపాదించే టెకీలు తనకు అనేక మంది తారసపడ్డారని సదరు వ్యక్తి చెప్పుకొచ్చారు. తాను 13 ఏళ్లుగా డాటా ఇంజినీర్‌గా చేస్తున్నట్టు అతడు చెప్పుకొచ్చాడు. కోటి వార్షిక శాలరీ ప్యాకేజీ తెచ్చుకోవడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చిందని అన్నాడు. నేటి తరం యువ ఉద్యోగులను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందని అన్నాడు. టెక్ రంగంలో నిజంగానే రూ.కోటి శాలరీ సర్వసాధారణమైపోయినట్టు అనిపిస్తోందని తెలిపారు.


దీంతో, ఒక్కసారిగా టెక్ రంగంపై చర్చ మొదలైంది. నేటి జమానాలో రూ.కోటి వార్షిక శాలరీ కూడా సర్వసాధారణమైపోయిందా అని జనాలు సందేహాలు లేవనెత్తారు. ఇక అనుమానం తీర్చుకునేందుకు ఆ వాల్‌మార్ట్ ఉద్యోగి ఓ పోల్ కూడా నిర్వహించారు. ఈ క్రమంలో పలువు టెకీ ఉద్యోగులు రెస్పాండయ్యారు. డాటా ఇంజినీరింగ్‌లో 13 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తికి రూ.75 లక్షల వార్షిక శాలరీ తగినదని పోల్‌లో పాల్గొన్న మూడో వంతు మంది అన్నారు. మరోమూడో వంతు మంది మాత్రం రూ.1.5 కోట్ల శాలరీ కరెక్టని చెప్పుకొచ్చారు. రూ.1 కోటి వార్షిక వేతనం సబబని మరికొందరు అభిప్రాయపడ్డారు.


మరికొందరు మాత్రం వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. ‘‘రూ.కోటి శాలరీ ఈ రంగంలో సర్వసాధారణం ఏమీ కాదు. పోటీ చాలా ఎక్కువగా ఉంది. ఈ స్థాయి శాలరీ ఇచ్చే సంస్థల నుంచి కాల్‌బ్యాక్ ఆశించడం కూడా అతి శయోక్తే అవుతుంది’’ అని ఓ వ్యక్తి తెలిపారు. రూ.కోటి శాలరీ.. టెక్ లీడ్, స్టాఫ్ ఇంజినీర్స్ లాంటి కొన్ని ప్రత్యేక ఉద్యోగాలకే అని తెలిపారు. ప్రాడక్ట్ బేస్డ్ సంస్థల్లోని మధ్య స్థాయి ఇంజినీర్లు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు తీసుకుంటారని తెలిపారు. అయితే, నేటి జమానాలో రూ.కోటి శాలరీ ఆశించడం అంత అసాధారణమేమీ కాదని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

ఈ విషయాల్లో ప్రపంచానికంటే భారత్ బెటరంటున్న అమెరికా మహిళ

భారతీయులు కాస్తంత మర్యాదగా నడుచుకుంటే మంచిదంటున్న కెనడా పౌరుడు

వాన పడుతోందని వర్క్ ఫ్రమ్ హోం అడిగిన ఉద్యోగి.. చివరకు జరిగిందంటే..

మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పులు తీర్చి.. అతడి తల్లిదండ్రుల భారం మోస్తూ..

Read Latest and Viral News

Updated Date - May 06 , 2025 | 03:30 PM