American Woman Praises India: ఈ విషయాల్లో ప్రపంచానికంటే భారత్ బెటరంటున్న అమెరికా మహిళ
ABN , Publish Date - May 05 , 2025 | 10:17 PM
ఎంతో అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల కంటే భారత్ కొన్ని విషయాల్లో మెరుగంటూ ఓ అమెరికా మహిళ ఇన్‌స్టాలో షేర్ చేసిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: భారతీయులకు స్వదేశంలోని పరిస్థితుల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, విదేశాల్లో ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లోని వారు ఇక్కడి పరిస్థితిపై వ్యక్తపరిచే అభిప్రాయాలు కాస్త ఆసక్తికరంగా ఉంటాయి. అన్ని సౌకర్యాలు పొందే పాశ్చాత్యులు భారత్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారంటే.. సమ్‌థింగ్ స్పెషల్ ఉందని భావించాల్సిందే. భారత్ ప్రత్యేకతల గురించి ఓ అమెరికా మహిళ చేసిన కామెంట్స్‌పై ప్రస్తుతం సరిగ్గా ఇలాంటి అభిప్రాయాలే వినిపిస్తున్నాయి.
కొన్ని విషయాల్లో ప్రపంచం కంటే భారత్ మెరుగంటూ క్రిస్టెన్ ఫిషెర్ అనే మహిళ సోషల్ మీడియాలో పంచుకున్న పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక్కడ కొన్నాళ్లుగా ఉంటున్న ఆమె అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఈ అభిప్రాయాలను వ్యక్తం చేసింది.
ఆమె తెలిపిన వివరాల ప్రకారం, భారత్‌లో వైద్యం చాలా చవక. పాశ్యాత్య దేశాల్లో ఖరీదైన వైద్యం అనేక మంది ఆందోళనకరంగా మారుతోంది. ప్రజారవాణా వ్యవస్థలు కూడా చవకైనవే. మెట్రో లాంటి వాటితో పాటు ఆటోలు, బస్సులు సామాన్యులకు అందుబాటు ధరల్లో రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. భారతీయ రైల్వేపై కూడా క్రిస్టెన్ ప్రశంసలు కురిపించింది. రుచికరమైన భారతీయ వంటకాలను కూడా ఆమె వేనోళ్ల పొగిడింది. ఇంత రుచిగా అందుబాటు ధరల్లో ఆహారం లభించడం ఓ ప్రత్యేకత అని వ్యాఖ్యానించింది. భారత్‌లో కుటుంబసంబంధాలపై కూడా ఆమె ప్రశంసలు కురిపించింది. ఆపద సమయాల్లో ఇక్కడి బంధుత్వాలు ఎంతో అక్కరకు వస్తాయని చెప్పుకొచ్చింది.
ఆర్థిక భద్రతతో పాటు భావోద్వేగ మద్దతు కూడా లభిస్తుందని తెలిపింది. వస్తువులు పాడవగానే పారేయకుండా బాగుచేసుకుని తిరిగి పునర్వినియోగించుకునే భారతీయుల అలవాటు కూడా గొప్పదని తెలిపింది. భారతీయుల పట్టుదల, పని సంస్కృతిని కూడా క్రిస్టెన్ ప్రశంసించింది. అన్నిరకాల పరిస్థితులను అలవాటు పడి కష్టించే పనిచేసే భారతీయుల ప్రశంసలకు అర్హులని పేర్కొంది. భారతీయ సంస్కృతికి ప్రతిరూపాలైన పండుగలు, జాతరలను కూడా ఆమె తెగ పొగిడింది. గ్లోబల్ సంస్థలతో పోలిస్తే భారతీయ విద్యాసంస్థలు ప్రపంచస్థాయి నాణ్యత కలిగిన విద్యను చవకగానే అందిస్తాయని పేర్కొంది. భారత లేబర్ మార్కెట్‌లో కార్మికులు వివిధ నైపుణ్యాలు వివిధ ధరలకు తమ సేవలను అందిస్తుండటం భారత్‌కు మరో కలిసొచ్చే అంశమని ఆమె చెప్పుకొచ్చింది. ఈ విషయాలపై జనాలు పెద్ద ఎత్తున తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
భారతీయులు కాస్తంత మర్యాదగా నడుచుకుంటే మంచిదంటున్న కెనడా పౌరుడు
వాన పడుతోందని వర్క్ ఫ్రమ్ హోం అడిగిన ఉద్యోగి.. చివరకు జరిగిందంటే..
మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పులు తీర్చి.. అతడి తల్లిదండ్రుల భారం మోస్తూ..