National Anthem Video: అమెరికన్ కుర్రాడి నోట మన జాతీయ గీతం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
ABN, Publish Date - Aug 15 , 2025 | 06:24 PM
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కార్యాలయాలు, ఆఫీసుల్లో జాతీయ జెండాను ఎగురవేయడం, జాతీయ గీతాన్ని ఆలపించడం అందరికీ తెలిసిందే. అయితే మన జాతీయ గీతం అమెరికాలో వినిపిస్తే.. అది కూడా అమెరికన్ కుర్రాడి నోట మన గీతం వినిపిస్తే.. ఎలా ఉంటుంది. తాజాగా, ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.
79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారతీయులు సంబరాలు చేసుకుంటాన్నారు. మరోవైపు విద్యార్థులు మొదలుకొని ఉద్యోగుల వరకూ అంతా ఉదయాన్నే జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. అలాగే స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో యూఎస్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మన జాతీయగీతాన్ని పొల్లుపోకుండా ఆలపించిన యూఎస్ యువకుడిపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు యువకుడిని అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కార్యాలయాలు, ఆఫీసుల్లో జాతీయ జెండాను ఎగురవేయడం, జాతీయ గీతాన్ని ఆలపించడం అందరికీ తెలిసిందే. అయితే మన జాతీయ గీతం అమెరికాలో వినిపిస్తే.. అది కూడా అమెరికన్ కుర్రాడి నోట మన గీతం వినిపిస్తే.. ఎలా ఉంటుంది. తాజాగా, ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. గేబ్ మెరిట్ అనే 17 ఏళ్ల అమెరికన్ వ్యక్తి.. (American youth sings Indian national anthem) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మన జాతీయ గీతాన్ని ఆలపించాడు.
సాధారణంగా మన రాజకీయ నాయకులతో పాటూ కొందరు ఉద్యోగులు.. జాతీయ గీతాన్ని ఆలపించడంలో తడబడుతుంటారు. అయితే ఈ అమెరికన్ అబ్బాయి మాత్రం ఎక్కడా తడబడకుండా.. అక్షరం పొల్లుపోకుండా ఆలపించాడు. ‘జన గణ మన అధినాయక జయహే’.. అంటూ ప్రారంభించిన అతను.. గీతాన్ని చివరివరకూ తప్పులు లేకుండా ఆలపించాడు. ఈ క్రమంలో కొన్ని పదాలను ఉచ్చరించడం కష్టంగా ఉన్నా కూడా ఎంతో జాగ్రత్తగా ఎలాంటి తప్పు లేకుండా పాడాడు. పాట పూర్తికాగానే అక్కడే ఉన్న వారు చప్పట్లు కొడుతూ.. అతన్ని అభినందించారు. మన జాతీయ గీతాన్ని మొత్తం గుర్తుపెట్టుకుని ఆలపించిన ఈ అమెరికన్ కుర్రాడు.. భారతీయుల ప్రశంసలు అందుకుంటున్నాడు.
ఈ వీడియోను దిశా పన్సురియా అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ఇది ఎంతో గర్శించదగ్గ విషయం’.., ‘అమెరికన్ కుర్రాడు మన జాతీయ గీతాన్ని ఆలపించడం ఎంతో ఆనందంగా ఉంది’.., ‘హ్యాట్సాప్ బ్రదర్.. ఎంతో బాగా పాడారు’.., ‘మన రాజకీయ నాయకులు ఇతడి వద్ద ట్యూషన్ తీసుకోవాలి’.. అంటూ కొందరు కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా లైక్‌లు, 27 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
చేపలు పడుతున్న వ్యక్తి.. వెనుకే వెళ్లిన సింహం.. చివరకు చూస్తే..
కోతులను కర్రతో తరిమికొట్టాడు.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Aug 15 , 2025 | 06:24 PM