Funny Viral Video: విరిగిన దంతాన్ని ఇలా సరిచేయవచ్చని ఇప్పుడే తెలిసింది.. ఇతను చేసిన పని చూస్తే..
ABN, Publish Date - Aug 08 , 2025 | 06:29 PM
ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఓ పిల్లాడి పన్ను విరిగిపోయింది. పండు చివరన కొంచెం విరిగిపోవడంతో ఇబ్బంది పడుతున్నాడు. ఇది గమనించిన ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న రాళ్లను కోసే యంత్రంతో అక్కడికి వచ్చాడు.
కొందరు వస్తువులను వాడే పద్ధతి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. కుక్కర్‌ను అంతా వంట చేయడానికి వాడితే... కొందరు ఐరన్ చేసేందుకు వాడేస్తుంటారు. అలాగే ఫ్రిడ్జ్‌ను కొందరు ఏసీలాగా, కూలర్‌ను కూరగాయల స్టోర్‌గా వాడుతూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ బాలుడు దంతం విరిగిపోవడంతో ఓ వ్యక్తి దాన్ని సరి చేశాడు. అయితే అతను సరి చేసిన విధానం చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘విరిగిన పండును ఇలా సరిచేయవచ్చని ఇప్పుడే తెలిసింది’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఓ పిల్లాడి ముందు వైపు దంతం విరిగిపోయింది. దంతం చివరన కొంచెం విరిగిపోవడంతో ఇబ్బంది పడుతున్నాడు. ఇది గమనించిన ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న రాళ్లను కోసే యంత్రంతో (Stone Cutting Machine) అక్కడికి వచ్చాడు.
మిషిన్ ఆన్ చేయగానే దానికి ఉన్న బ్లేడ్ గిర్రున తిరిగింది. దాంతో ఆ పిల్లాడి దంతాల (Teeth) చివరన సున్నింతా రుద్దాడు. ఇలా కొద్ది సేపు ఆ యంత్రంతో అటూ, ఇటూ రుద్ది సూదిగా ఉన్న దంతాన్ని నునుపుగా చేశాడు. దీంతో ఆ పిల్లాడి సమస్య పరిష్కారమైంది. అయితే ఇలా చేయడం ప్రమాదకరమని చాలా మంది సలహాలు ఇస్తున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘దంత వైద్యులకే షాక్ ఇచ్చాడుగా’.. అంటూ కొందరు, ‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా లైక్‌లు, 1.68 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
నిర్జీవంగా పడి ఉన్న భాగస్వామి.. గమనించిన హంస చివరకు ఏం చేసిందో చూస్తే..
వ్యూస్ కోసం భర్త అని కూడా చూడకుండా.. ఎలాంటి కామెంట్స్ చేసిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Aug 08 , 2025 | 06:42 PM