Funny Jugaad Viral Video: చిన్న ట్రిక్‌తో బట్టతలను మార్చేశాడుగా.. ఇతడి తెలివి చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
ABN, Publish Date - Aug 07 , 2025 | 08:08 PM
ఓ వ్యక్తి బీచ్‌లో ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే అతడికి బట్టతల కావడంతో.. ఎలాగైనా అందరి ముందు కవర్ చేసుకోవాలని అనుకుంటాడు. అయితే సమయానికి టోపీ కూడా లేకపోవడంతో.. చివరకు వినూత్నంగా ఆలోచించాడు..
కొందరు చేసే వింత వింత ప్రయోగాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. కొందరు కళ్లెదురుగా ఉన్న వస్తువులతో అద్భుతాలు క్రియేట్ చేస్తుంటారు. ఇంకొందరు చిన్న చిన్న ట్రిక్స్‌తో పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారాలు కనిపెడుతుంటారు. ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, ఓ వ్యక్తి బీచ్‌లో చేసిన వింత ప్రయోగం వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. బట్టతలతో ఉన్న ఆ వ్యక్తి.. చూస్తుండగానే కవర్ చేశాడు. ఇతడి ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బీచ్‌లో ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే అతడికి బట్టతల కావడంతో.. ఎలాగైనా అందరి ముందు కవర్ చేసుకోవాలని అనుకుంటాడు. అయితే సమయానికి టోపీ కూడా లేకపోవడంతో వివిధ రకాలుగా ఆలోచించాడు. చివరకు అతడి బుర్రకు ఓ ఐడియా తట్టింది. ఐడియా రాగానే ఆచరణలో పెట్టేశాడు.
ఇసుకలో తలను పెట్టి కాసేపు (Man buried his bald head in sand) అటూ, ఇటూ రుద్దాడు. ఆ తర్వాత పైకి తీసి చూడగా.. వెంట్రుకలు లేని ప్రాంతం మొత్తం ఇసుక కవర్ అయిపోయింది. అది కూడా చూసేందుకు చిన్న చిన్న వెంట్రుకల తరహాలో, వెరైటీ డిజైన్‌లా కనిపించింది. చూసేవారికి అతడి తలపై వెంట్రుకలు ఉన్నట్లే కనిపించింది. ఇలా ఇసుకతో తన బట్టతలను కవర్ చేసి, కళ్లద్దాలు పెట్టి.. స్టైల్‌గా చీచ్‌లో నడుస్తూ ఎంజాయ్ చేశాడన్నమాట.
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘బుర్రకు పని చెప్పడమంటే ఇదేనేమో’.. అంటూ కొందరు, ‘బట్టతలపై ఫ్రీగా జుట్టు మొలిపించాడుగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
నిర్జీవంగా పడి ఉన్న భాగస్వామి.. గమనించిన హంస చివరకు ఏం చేసిందో చూస్తే..
వ్యూస్ కోసం భర్త అని కూడా చూడకుండా.. ఎలాంటి కామెంట్స్ చేసిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Aug 07 , 2025 | 08:08 PM