ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Snake Viral Video: పైపును ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN, Publish Date - Jun 29 , 2025 | 06:00 PM

రోడ్డు పైకి వచ్చిన పామును చూసి జనాలు భయంతో పరుగులు తీశారు. చివరకు వారిలో ఓ వ్యక్తి పామును పట్టుకోవడానికి ముందుకొచ్చాడు. చేతిలో చిన్న పైపుతో అక్కడికి వచ్చిన అతను.. పాము దగ్గరికి వెళ్లాడు. చివరకు ఎలా పట్టుకున్నాడో చూసి అంతా అవాక్కవుతున్నారు..

సోషల్ మీడియాలో స్నేక్ క్యాచింగ్ వీడియోలు అనేకం వైరల్ అవుతుంటాయి. అనుభవం గల స్నేక్ క్యాచర్లు పాములను చిత్రవిచిత్రంగా పట్టుకోవడం చూస్తుంటాం. కొందరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వట్టి చేతులతో పట్టేస్తుంటారు. ఇంకొందరు ప్రమాదకర పాములను సైతం సులభంగా పట్టుకోవడం చూస్తుంటాం. తాజాగా, ఓ వ్యక్తిపామును ఎంతో తెలివిగా పట్టుకోవడం చూసి అంతా అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. పైపును ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డు పైకి వచ్చిన పామును చూసి జనాలు భయంతో పరుగులు తీశారు. చివరకు వారిలో ఓ వ్యక్తి పామును పట్టుకోవడానికి ముందుకొచ్చాడు. చేతిలో చిన్న పైపుతో అక్కడికి వచ్చిన అతను.. పాము దగ్గరికి వెళ్లాడు.

పాము తల వద్ద పైపు చివరను ఉంచడంతో పాము అందులోకి దూరింది. తర్వాత మరో వైపు నుంచి బయటికి వచ్చింది. అయితే ఇలా బయటికి రాగానే.. అతను తోక భాగం వద్ద గట్టిగా పట్టుకుంటాడు. దీంతో పాము ఎటూ కదలడానికి అవకాశం లేకుండా పోయింది. ఇలా పైపుతో పట్టుకోవడం (Ma Caught snake with Pipe) వల్ల పాము కాటేసే ప్రమాదం కూడా తప్పింది. ఇతడి తెలివితేటలు చూసి అంతా అవాక్కవుతున్నారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇతడి తెలివి మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘పైపుతో ఇలాక్కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3.20 లక్షలకు పైగా లైక్‌లు, 13.4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి..

బ్రిడ్జి వద్ద ఏకాంతంగా కలిసిన ప్రేమ జంట.. ఇంతలో పొంగుకొచ్చిన వరద నీరు.. చివరకు..

మీ దుంపలు తెగా.. చైనాను మించిపోయారు కదరా.. ఆమ్లెట్ ఎలా చేస్తున్నాడో చూడండి..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jun 29 , 2025 | 06:01 PM