Nizams Gift to Queen Elizabeth: బ్రిటన్ రాణి వివాహం సందర్భంగా నిజాం రాజు ఇచ్చిన నెక్లెస్ విలువ ఎంతో తెలిస్తే..
ABN, Publish Date - May 06 , 2025 | 06:15 PM
భారత తొలి బిలియనీర్‌గా పేరు ప్రఖ్యాతులు పొందిన హైదరాబాద్ 7వ నిజాం బ్రిటన్ రాణి వివాహ సమయంలో అత్యంత ఖరీదైన నెక్లెస్‌ను బహుమతిగా ఇచ్చారు. మరి ఈ ఆభరణం విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: నేటి కార్పొరేట్ జమానాలో బిలియనీర్ అనే పదం సాధారణమైపోయింది కానీ ఓ 80 సంవత్సరాల క్రితం ఈ మాట వినబడటం చాలా అరుదు. అయితే, అప్పట్లోనే హైదరాబాద్ సంస్థాన పాలకుడు 7వ, చివరి నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారత తొలి బిలియనీర్‌గా ప్రపంచఖ్యాతి గడించారు. ఆయన సంపద విలువ ఏకంగా రూ.1700 కోట్లు. బ్రిటన్ రాజ్యానికి అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న నిజాం.. 1947లో బ్రిటన్ రాణి ఎలిజబెత్‌కు వివాహం సందర్భంగా అత్యంత ఖరీదైన వజ్రాల నెక్లెస్‌ను బహుమతిగా ఇచ్చారు
బ్రిటన్ రాణి వివాహానికి ఆహ్వానం అందినా వెళ్లలేకపోయిన నిజాం ఇందుకు ప్రతిగా ఈ వజ్రాల హారాన్ని బహుమతిగా పంపించారు. బ్రిటన్‌పై తన గౌరవాన్ని చాటుకునే విధంగా రాణికి తనకు నచ్చిన డిజైన్ ఎంచుకునే స్వేచ్ఛను నిజాం ఇచ్చారట. రాణి సూచనల మేరకు ఆమెకు నచ్చినట్టు హారాన్ని డిజైన్ చేయాలని అప్పటి ప్రముఖ జువెలర్స్ కార్టియర్‌కు సూచించారు. మొత్తం 300 వజ్రాలను ప్లాటినం హారంలో పొదిగి దీన్ని డిజైన్ చేశారు. ఇంగ్లి్ష్ సంప్రదాయిక రోజ్ డిజైన్ స్ఫూర్తిగా ఈ హారాన్ని డిజైన్ చేయించారు. వాస్తవానికి దీన్ని మెడలో ధరించే హారంగా డిజైన్ చేశారు. ఆ తరువాత ఇందులోని కొన్ని వజ్రాలను తొలగించి డిజైన్ మార్చారు.
బ్రిటన్ సింహాసనం అధిష్టించక మునుపు అధికారిక ఫొటో దిగేందుకు రాణి ఎలిజబెత్ ఈ నెక్లెస్‌ను ధరించారట. ఇక, 2014లో కేట్ మిడిల్‌టన్ కూడా ఈ నెక్లెస్‌ను ధరించి నేషనల్ పొట్రెయిట్ గ్యాలరీ కోసం ఫొటో దిగారు. నేటి ధరల ప్రకారం, ఈ నగ ఖరీదు రూ.694 కోట్లు ఉంటుందని సమాచారం. దీంతో, ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగగా ఇది ఖ్యాతి గాంచింది. ప్రస్తుతం బ్రిటన్ రాజవంశానికి చెందిన నగల్లో ఇది ఒక ముఖ్య భాగంగా మారింది. రాజ కుటుంబానికి చెందిన ముఖ్య వ్యక్తులు దీన్ని అప్పుడప్పుడూ ధరిస్తుంటారు. 2022లో బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీ వేదికగా ప్రజలకు చూపించారు.
ఇక నిజాం వద్ద ఉన్న నగల గురించి అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా జనాలు అబ్బురపడుతూ చెప్పుకునేవారట. జేకబ్ డైమండ్, సట్లాడా నెక్లెస్ మొదలు వజ్రవైఢూర్యాలు పొదిగిన ఆభరణాలు అనేకం నిజాం వద్ద ఉండేవట. ప్రస్తుతం వీటిల్లో కొన్ని దేశవ్యాప్తంగా ఉన్న పలు మ్యూజియంలల్లో ప్రదర్శనకు ఉంచారు.
ఇవి కూడా చదవండి:
ఈ విషయాల్లో ప్రపంచానికంటే భారత్ బెటరంటున్న అమెరికా మహిళ
భారతీయులు కాస్తంత మర్యాదగా నడుచుకుంటే మంచిదంటున్న కెనడా పౌరుడు
వాన పడుతోందని వర్క్ ఫ్రమ్ హోం అడిగిన ఉద్యోగి.. చివరకు జరిగిందంటే..
మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పులు తీర్చి.. అతడి తల్లిదండ్రుల భారం మోస్తూ..
Updated Date - May 06 , 2025 | 07:18 PM