ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Funny Jugaad Viral Video: ఫ్రీగా ఫ్రిడ్జ్ దొరికిందని సంబరపడ్డాడు.. డోరు తీయాలని చూడగా.. షాకింగ్ సీన్..

ABN, Publish Date - Aug 07 , 2025 | 09:05 PM

రోడ్డు పక్కన కూల్‌డ్రింక్స్‌తో నిండిన ఫ్రిడ్జ్‌ను పెట్టారు. ఆ దారిన వెళ్తున్న ఓ వ్యక్తి.. ఈ ఫ్రిడ్జ్‌ను చూసి ఎంతో సంబరపడ్డాడు. ‘ఫ్రీగా ఫ్రిడ్జ్ దొరికింది.. వెంటనే కూల్ డ్రింక్స్ తాగేద్దాం’.. అని అనుకుంటూ సంతోషంగా దగ్గరికి వెళ్లాడు. తీరా డోరు తీయాలని ప్రయత్నించగా షాకింగ్ సీన్ కనిపించింది.

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎక్కడ ఏ వింత జరిగినా ఇట్టే వీడియో రూపంలో నెట్టింట్లోకి వచ్చి చేరుతోంది. వీటిలో కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొన్ని వీడియోలు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇంకొందరు చేసే వినూత్న ప్రయోగాలు చూసినప్పుడు తెగ నవ్వు వస్తుంటుంది. ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తికి రోడ్డు పక్కన కూల్‌డ్రిక్స్‌తో కూడిన ఫ్రిడ్జ్ కనిపించింది. దీంతో ఎంతో సంతోషంగా దగ్గరికి వెళ్లి డోర్ తీసేందుకు ప్రయత్నించాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన కూల్‌డ్రింక్స్‌తో నిండిన ఫ్రిడ్జ్‌ను పెట్టారు. ఆ దారిన వెళ్తున్న ఓ వ్యక్తి.. ఈ ఫ్రిడ్జ్‌ను చూసి ఎంతో సంబరపడ్డాడు. ‘ఫ్రీగా ఫ్రిడ్జ్ దొరికింది.. వెంటనే కూల్ డ్రింక్స్ తాగేద్దాం’.. అని అనుకుంటూ సంతోషంగా దగ్గరికి వెళ్లాడు. తీరా డోరు తీయాలని ప్రయత్నించగా షాకింగ్ సీన్ కనిపించింది. డోరును పట్టుకోవాలని చూడగా.. జారిపోతూ కనిపించింది.

ఇంతకీ అది ఏంటా అని వెనక్కు వెళ్లి చూడగా.. అది అసలు ఫ్రిడ్జే కాదని తెలిసింది. ఎవరో త్రీడీతో కూడిన ఎల్‌ఈడీని (3D Fridge) ఏర్పాటు చేసి, ఇలా అదరినీ ఫూల్స్ చేస్తున్నారని చివరకు అర్థమైంది. అయితే ఈ విషయం దగ్గరికి వెళ్లే వరకూ తెలియనంత రియాలిటీగా క్రియేట్ చేశారు. చివరకు అది ఫ్రిడ్జ్ కాదని తెలుసుకున్న వారంతా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఫ్రీగా ఫ్రిడ్జ్ దొరికిందని సంబరపడితే.. ఇలా అయ్యిందేంటీ’.. అంటూ కొందరు, ‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 120కి పైగా లైక్‌లు, 2 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి..

నిర్జీవంగా పడి ఉన్న భాగస్వామి.. గమనించిన హంస చివరకు ఏం చేసిందో చూస్తే..

వ్యూస్ కోసం భర్త అని కూడా చూడకుండా.. ఎలాంటి కామెంట్స్ చేసిందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 07 , 2025 | 09:05 PM