Electrical hazard: చిన్న తప్పు.. మరణానికి ఎలా దారి తీసిందో చూడండి..
ABN, Publish Date - Jul 26 , 2025 | 10:37 AM
కెమికల్ అనే ఫ్యాక్టరీ బయట ఆగిన లోడ్ లారీ ఆగి ఉంది. అందులోని వస్తువులను దించిన తర్వాత.. లారీ డ్రైవర్ రామ్‌లాల్ గాద్రి (40) టార్పాలిన్ పక్కన పెట్టేందుకు వాహనం పైకి ఎక్కాడు. అయితే ఈ క్రమంలో చూసుకోకుండా చేసిన చిన్న తప్పుతో చివరకు అతడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది..
చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. అప్పటిదాకా సంతోషంగా ఉన్న వారు సడన్‌గా మృత్యు ఒడిలోకి జారుకుంటుంటారు. మరికొందరు తెలీక చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ లారీ డ్రైరవ్ చేసిన చిన్న తప్పు.. మరణానికి ఎలా దారి తీసిందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లోని (Rajasthan) ఉదయపూర్‌లోని రికో ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మోడీ కెమికల్ అనే ఫ్యాక్టరీ బయట ఆగిన లోడ్ లారీ ఆగి ఉంది. అందులోని వస్తువులను దించిన తర్వాత.. లారీ డ్రైవర్ రామ్‌లాల్ గాద్రి (40) టార్పాలిన్ పక్కన పెట్టేందుకు వాహనం పైకి ఎక్కాడు.
లారీ చివరగా నిలబడి టార్పాలిన్ పట్టను సర్దుకుంటుండగా.. చూసుకోకుండా పక్కకు జరగడంతో పైన ఉన్న విద్యుత్ హైటెన్షన్ వైర్లు తలకు తగులుతున్నాయి. దీంతో విద్యుత్ షాక్ తగిలి (Driver falls from lorry due to electric shock) అతను ట్రక్కు పైనుంచి కిందపడిపోయాడు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. చుట్టు పక్కల వారు గమనించి పరుగుపరుగున అక్కడికి చేరుకున్నారు. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. రామ్‌లాల్ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు.
మృతుడి బంధువులు, స్థానికులు ఫ్యాక్టరీ బయట పెద్దసంఖ్యలో గుమిగూడారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని, మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘అయ్యో ఎంత ఘోరం జరిగింది’.. అంటూ కొందరు, ‘ఇలాంటి సమయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
శివుడితో కామెడీ చేస్తే ఇలాగే ఉంటుంది.. ఎలాంటి ప్రతిఫలం దక్కిందంటే..
ఈ భర్తను చూస్తే అయ్యో పాపం అనాల్సిందే.. బైకుపై భార్య ఏం చేస్తుందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Jul 26 , 2025 | 11:05 AM