Holy Celebrations : ఆకాశాన్నంటిన స్కై బ్లాస్ట్ హోలీ రంగులు.. ఎక్కడంటే..
ABN, Publish Date - Mar 14 , 2025 | 12:24 PM
Holy Celebrations Hyderabad : సంబరాలు అంబారాన్నంటేలా హోలీ వేడుకలు జరిగాయని అంటారు. అయితే, ఇక్కడ నిజంగా హోలీ రంగులు ఆకాశాన్నంటాయి. దక్షిణాదిలో అతిఎత్తైన టవర్‌పై నిర్వహించిన స్కై బ్లాస్ట్ హోలీ రంగులు నింగికి సప్తవర్ణాలద్ది కొత్త అనుభూతిని కలిగించాయి. అదెలాగంటే..
దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన టవర్‌గా ప్రసిద్ధి చెందిన కోకాపేటలో ఉన్న SAS క్రౌన్. 60 అంతస్తులున్న ఈ టవర్‌పై హోలీ వేడుకల సరికొత్త రీతిలో అదిరిపోయేలా నిర్వహించారు.
హైదరాబాద్ స్కై లైన్లో హెలీ సందర్భంగా రంగుల తుఫాన్ చెలరేగింది. SAS Crown వేదికగా "స్కై బ్లాస్ట్" పేరుతో హోలీ వేడుక ఘనంగా జరిగింది.
హోలీ అంటే సాధారణంగా గ్రౌండ్ లెవల్ లో జరుపుకునే పండుగ. కానీ ఈసారి SAS Crown ఈ సంబరాలను ఆకాశంలో జరిపి అందరికీ కొత్త అనుభూతిని అందించింది. టాప్ ఫ్లోర్, స్కై డెక్, ఈవెంట్లో ప్రతి అంశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కేవలం నేల మీదే కాదు. ఆకాశంలోనూ హోలీ జరుపుకోవచ్చు అని నిరూపించిన వేడుక ఇది. SAS Crown పై నిర్వహించిన "స్కై బ్లాస్ట్ హోలీ" మరపురాని అనుభూతిని అందించింది.
నగరంలోని అత్యంత ఎత్తైన భవనం అయిన SAS Crown ఈసారి ప్రత్యేక హోలీ ఉత్సవాలకు వేదికగా నిలిచింది. 360° స్కై వ్యూ, సిటీ వ్యూ, లగ్జరీ ఫెస్టివల్, ప్రైవేట్ పార్టీ అందరికీ కొత్త అనుభూతిని అందించాయి.
హోలీ అంటే రంగులు, సంగీతం, ఉత్సాహం. కానీ ఈసారి ఆకాశాన్ని తాకేలా హోలీ సెలబ్రేట్ చేసింది SAS Crown. రంగుల మెరుపులతో హైదరాబాద్ స్కైలైన్ మిలమిల మెరిసిపోయింది.
Updated Date - Mar 14 , 2025 | 12:29 PM