GST Car Price Drop: GST ఎఫెక్ట్.. భారీ తగ్గిన కార్ల ధరలు..
ABN, Publish Date - Sep 23 , 2025 | 09:01 AM
భారతదేశంలో జీఎస్టీ సంస్కరణలను కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. జీఎస్టీలో నాలుగు పన్ను శ్లాబుల నుంచి రెండు 12, 28 శ్లాబులను తొలగించి 5, 18 శ్లాబులను కొనసాగిస్తామని తెలిపింది. దీంతో చాలా రకాల వస్తువుల ధరలు తగ్గుతాయి. అలాగే కార్ల ధరలు సైతం దిగివచ్యాయి. జీఎస్టీ 2.0 ద్వారా దేశీయ మార్కెట్లో ఎంట్రీ లెవల్ హ్యాచ్ బ్యాక్ నుంచి లగ్జరీ ఎస్‌యూవీ కార్ల వరకు ధరలు తగ్గుతాయి. కొత్తు కారు కొనుగోలు చేసే వారు కనిష్ఠంగా రూ.65 వేల నుంచి గరిష్ఠంగా రూ. 11 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే, అది కారు మోడల్ బట్టి మారుతుంటుంది.చిన్న కార్లపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. అలాగే సెస్ సైతం రద్దు చేశారు. 1200 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యంతో పెట్రోలి ఇంజిన్ ఉండి 4 మీటర్ల కంటే తక్కువ పొడువు ఉన్నవి, 1500 సీసీ వరకు డీజిల్ వాహనాలకు 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.
మారుతీ సుజుకీ కార్లు: ఆల్టో కే10 ధర రూ.40 వేలు, వెగన్ ఆర్ రూ.57 వేలు, స్విఫ్ట్ రూ.58 వేలు, డిజైర్ రూ.61 వేలు, బలెనో రూ.60 వేలు, ఫ్లాంక్స్ రూ.68 వేలు, బ్రెజా రూ.78 వేలు తగ్గినట్లు సమాచారం.
టాటా మోటార్స్ కార్లు: టియాగో కారుపై రూ.75 వేలు, టిగోర్ కారుపై రూ.80 వేలు, ఆల్ట్రోజ్ కారుపై రూ.1.10 లక్షలు, టాటా పంచ్ కారుపై రూ.85 వేలు, నెక్సాన్ కారుపై రూ.1.55 లక్షలు, హారియర్ కారుపై రూ.1.40 లక్షలు, సఫారీ కారుపై రూ. 1.45 లక్షలు తగ్గినట్లు తెలుస్తోంది.
హ్యూందాయ్ కార్లు: గ్రాండ్ ఐ10 నియోస్ ధర రూ.73,808, ఆరా కారుపై రూ.78,465, ఎక్స్‌టెర్ కారుపై రూ.89,209, హ్యూందాయ్ ఐ20 కారు ధర రూ.98,053, ఐ20 ఎన్ లైన్ ధర రూ.1.08 లక్షలు, వెన్యూ రూ.1.23 లక్షలు వెర్నా ధర రూ.60,640, క్రెటా ధర రూ.72,145 తగ్గుతున్నట్లు సమాచారం.
టయోటా కార్లు: ఇన్నోవా క్రిస్టాపై రూ.1.80 లక్షలు, ఇన్నోవా హైక్రాస్ కారుపై రూ.1.15 లక్షలు, ఫార్చునర్ కారుపై రూ.3.49 లక్షలు, లెంజండర్ కారుపై రూ.3.34 లక్షలు, హీలక్స్ కారుపై రూ.2.52 లక్షలు, వెల్‌ఫైర్ కారుపై రూ.2.78 లక్షలు, కామ్రీ కారుపై రూ.1.01 లక్షలు తగ్గినట్లు సమాచారం.
మహీంద్రా కార్లు: బొలెరో నియో కారుపై రూ.1.27 లక్షలు, ఎక్స్‌యూవి 3ఎక్స్ఓ పెట్రోలు కారుపై రూ.1.40 లక్షలు, ఎక్స్‌యూవి 3ఎక్స్ఓ డీజిల్ కారుపై రూ.1.56 లక్షలు, మహీంద్రా థార్ రేంజ్ కారుపై రూ.1.35 లక్షలు, మహీంద్రా థార్ ఆర్ఓఎక్స్ఎక్స్ రూ.1.33 లక్షలు, స్కార్పియో క్లాసిక్ కారుపై రూ.1.01 లక్షలు, స్కార్పియో ఎన్ కారుపై రూ.1.45 లక్షలు తగ్గినట్లు తెలుస్తోంది.
స్కోడా కార్లు: స్కోడా కోడియాక్ కారుపై రూ.3.30 లక్షలు, స్కోడా కుషాక్ కారుపై రూ.2.50 లక్షలు, స్కోడా స్లావియా కారుపై రూ.1.2 లక్షలు తగ్గినట్లు సమాచారం.
Updated Date - Sep 23 , 2025 | 09:03 AM