ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: విజయవాడ మహాగణపతి సేవలో సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Aug 28 , 2025 | 11:09 AM

విజయవాడలోని సితార సెంటర్‍లో డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మహాగణపతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు.

1/7

విజయవాడలోని సితార సెంటర్‍లో డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మహాగణపతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు.

2/7

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు.. గణపతి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అంతకముందు మండపం వద్దకు చేరుకున్న చంద్రబాబుకు కమిటీ సభ్యులు, నేతలు ఘనంగా స్వాగతం పలికారు.

3/7

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వినాయకుడిని ప్రార్థించినట్టు తెలిపారు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని.. అలాగే అభివృద్ధి పనులకు ఆటంకం కలగకూడదని దేవుడిని కోరుకున్నట్లు వెల్లిడించారు.

4/7

బుడమేరు వరద మరోసారి రాకుండా చర్యలు తీసుకున్నాని సీఎం చంద్రబాబు తెలిపారు. గోదావరి నుంచి 1500 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయని.. రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండుకుండలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

5/7

డూండీ సేవాసమితి ఆధ్వర్యంలో ఐదేళ్ల పాటు ఉత్సవాలు జరుపుకోలేకపోయారని.. అప్పుడు అలాంటి పాలకులు ఉన్నారని సీంఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పుడు దొంగ దండాలు పెడితే వినాయకుడు క్షమించరని, వాళ్లకు తగిన విధంగా బుద్ధి చెబుతారని తెలిపారు.

6/7

సాధారణంగా ఉత్సవాల సమయంలో ప్రతి ఏడాదీ మైక్, కరెంట్ సప్లై కోసం భక్తులు ప్రభుత్వాన్ని పర్మిషన్ అడుగుతుంటారని సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే ఈసారి భక్తులకు అలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయించినట్లు చెప్పారు. ప్రభుత్వంపై రూ.30 కోట్ల భారం పడుతున్నా కరెంట్ ఫ్రీగా ఇస్తున్నామని పేర్కొన్నారు.

7/7

గణేశుడికి సీఎం చంద్రబాబు హారతి ఇచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు.

Updated Date - Aug 28 , 2025 | 11:09 AM