Nizamabad Ganesh Shobha Yatra: గణేషుని శోభాయాత్ర ప్రారంభించిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
ABN, Publish Date - Sep 06 , 2025 | 06:17 PM
నిజామాబాద్ జిల్లాలో జరిగిన గణేషుని రథయాత్రను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
నిజామాబాద్ జిల్లాలో వినాయక నిమజ్జన మహోత్సవాలు అంగరంగవైభంగా సాగాయి.
జిల్లాలో గణేషుని రథయాత్రను తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు.
అశేష జనవాహిని తరలివచ్చిన ఈ శోభాయాత్రలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కూడా పాల్గొన్నారు.
బొజ్జ గణపయ్య రథాన్ని నిమజ్జన ప్రదేశం వరకూ భక్తులు లాగుతూ తీసుకెళ్లారు. డప్పులు, భక్తుల నినాదాల మధ్య కార్యక్రమం సందడిగా సాగింది.
గణపతి బప్పాకీ జై అనే నినాదాల మధ్య గణనాథుడు నిమజ్జన ప్రదేశానికి చేరుకున్నాడు. పార్వతీ తనయుడికి నిజామాబాద్ వాసులు ఘనంగా వీడ్కోలు పలికారు.
Updated Date - Sep 06 , 2025 | 06:32 PM