ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: నవీన్ యాదవ్‌ గెలుపుపై సీఎం రేవంత్‌రెడ్డి ఏమన్నారంటే..

ABN, Publish Date - Nov 15 , 2025 | 07:26 AM

జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ని అఖండ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

1/11

జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ని అఖండ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

2/11

ఈ సందర్భంగా గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

3/11

టీపీసీసీ నాయకత్వ స్థాయి నుంచి కార్యకర్త స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఏకతాటిపై నిలిచి, ఐక్యంగా పని చేస్తే కాంగ్రెస్ గెలుపును ఏ శక్తి ఆపలేదనే విషయాన్ని ఈ ఫలితాలు రుజువు చేశాయని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి.

4/11

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు కార్యకర్తలకు అంకితమని అభివర్ణించారు సీఎం రేవంత్‌రెడ్డి.

5/11

ఈ గెలుపు హైదరాబాద్ నగర అభివృద్ధిపై, ఇక్కడ పేదల సంక్షేమంపై తమ బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

6/11

రెండేళ్లుగా నగరాభివృద్ధికి సంబంధించిన మెట్రో విస్తరణ, మూసీ నది ప్రక్షాళన, ఫోర్త్ సిటీ నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్డు వంటి తమ ఆలోచన, విజన్, కార్యచరణకు ఈ ఎన్నికల ఫలితాలతో ప్రజలు ఆమోదం తెలిపారని పేర్కొన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

7/11

వచ్చే మూడేళ్లు ఆ దిశగా నిరంతరం పని చేయడానికి ఈ ఎన్నికల ఫలితాలు తమకు సరికొత్త ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చాయని వివరించారు సీఎం రేవంత్‌రెడ్డి.

8/11

ఎన్నికలప్పుడే రాజకీయమని.. వచ్చే మూడేళ్లు అభివృద్ధి, పేదల సంక్షేమమే తమ మంత్రం అని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి.

9/11

జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి ఇక తమ బాధ్యత అని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు.

10/11

60 నుంచి 65 శాతం ఆదాయం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచే వస్తోందని తెలిపారు సీఎం రేవంత్‌రెడ్డి.

11/11

దశాబ్ద కాలంగా ప్రజల మధ్య కాంగ్రెస్ మనుగడ సాధిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పోలైన ఓట్లలో 51 శాతం తమ పార్టీకి వచ్చాయని వెల్లడించారు.

Updated Date - Nov 15 , 2025 | 07:26 AM