Army officers Meets CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఆర్మీ అధికారులు
ABN, Publish Date - Sep 07 , 2025 | 06:45 AM
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శనివారం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్‌సేథ్ కలిశారు. ఈ నేపథ్యంలో సీఎంతో పలువురు ఆర్మీ అధికారులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాజీ సైనికుల సంక్షేమం, విపత్తు సహాయక చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలు వంటి కీలక అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డితో ఆర్మీ అధికారులు చర్చించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శనివారం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్‌సేథ్ కలిశారు. ఈ నేపథ్యంలో సీఎంతో పలువురు ఆర్మీ అధికారులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మాజీ సైనికుల సంక్షేమం, విపత్తు సహాయక చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలు వంటి కీలక అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డితో ఆర్మీ అధికారులు చర్చించారు.
భారత సైన్యం అందిస్తున్న అమూల్యమైన సేవలకు గానూ సీఎం రేవంత్‌రెడ్డి ఆర్మీ అధికారులను ప్రశంసించారు.
అనంతరం జనరల్ ధీరజ్‌సేథ్ మాట్లాడారు. భారత సైన్యం దేశ రక్షణతో పాటు అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం అంకితభావంతో పనిచేస్తుందని సీఎంకు హామీ ఇచ్చారు.
ఈ సమావేశం ద్వారా తెలంగాణాలో సైన్యం, పౌర సంబంధాలు మరింతగా బలపడుతాయని ఆర్మీ అధికారులు వెల్లడించారు.
సీఎం రేవంత్‌రెడ్డిను కలిసిన వారిలో దక్షిణ భారత ఏరియా జీవోసీ, మేజర్ జనరల్ ఆర్ఎన్ శ్రీనివాస్, తెలంగాణ, ఏపీ జీవోన్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా కూడా ఉన్నారు.
Updated Date - Sep 07 , 2025 | 06:56 AM