యాదాద్రిలో గిరి ప్రదక్షిణకు పోటెత్తిన స్వాములు
ABN, Publish Date - Dec 01 , 2025 | 09:27 AM
యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయం చుట్టూ సోమవారం తెల్లవారుజామున గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఈ గిరి ప్రదక్షిణలో భారీగా అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.
ప్రముఖ పుణ్య క్షేత్రమైన యాదాద్రి (యాదగిరిగుట్ట)లో శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయం చుట్టూ సోమవారం తెల్లవారుజామున గిరి ప్రదక్షిణ ఘనంగా ప్రారంభమైంది.
వైకుంఠ ద్వారం వద్ద ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ గిరి ప్రదక్షిణలో ఆయన పాల్గొన్నారు.
ఈ గిరి ప్రదక్షిణ సందర్భంగా గోవుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆవు సైతం ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంది.
యాదగిరిగుట్ట దేవస్థానం, స్థానిక అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ గిరి ప్రదక్షిణకు స్వాములు పోటెత్తారు.
చిన్న పెద్దలు అంతా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు.
అయ్యప్ప స్వామి, నరసింహ స్వామిల నామస్మరణ, భజనలు, భక్తి గీతాలాపనతో అయ్యప్ప స్వాములు ఈ ప్రదక్షిణ చేపట్టారు.
గిరి ప్రదక్షిణ నేపథ్యంలో ఆలయ పరిసర రహదారులన్నీ స్వాములతో కిక్కిరిసి పోయాయి.
సోమవారం ఏకాదశి కావడంతో.. ఆలయ పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ గిరి ప్రదక్షిణకు భక్తులు భారీగా తరలి రావడంతో.. దేవస్థానం సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
గిరి ప్రదక్షిణకు అసంఖ్యాకంగా భక్తులు తరలి రావడంతో లక్ష్మీనరసింహుడు, అయ్యప్ప స్వాముల నామస్మరణతో ఆలయ పరిసర ప్రాంతాలు మార్మోగాయి.
Updated Date - Dec 01 , 2025 | 09:27 AM