ముక్కోటి ఏకాదశి.. ఆలయాల్లో వెల్లివిరిసిన ఆధ్మాత్మిక శోభ..
ABN, Publish Date - Dec 30 , 2025 | 11:41 AM
వైకుంఠ ఏకాదశి సందర్భంగా కడప జిల్లాలోని ప్రముఖ వైష్ణవ ఆలయాలకు భక్తులు బారులు తీరారు. జిల్లా వ్యాప్తంగా ఎటుచూసినా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది.
ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని.. కడప జిల్లాలోని పలు వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
తెల్లవారుజామునుంచే శ్రీ మహా విష్ణువు దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.
పుత్రదా ఏకాదశి సందర్భంగా జిల్లాలోని పలు ఆలయాలను శోభయామానంగా అలంకరించారు ఆలయ సిబ్బంది.
ప్రముఖ ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తులు.
జిల్లా వ్యాప్తంగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలు.. గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి.
కడప జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ నెలకొంది.
కలియుగ వైకుంఠ నారాయణుడిని దర్శనార్థం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Updated Date - Dec 30 , 2025 | 11:44 AM