Tirumala: తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ
ABN, Publish Date - Oct 08 , 2025 | 10:23 AM
తిరుమలలో మంగళవారం రాత్రి పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. నిన్న రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, బోర్డు సభ్యులు నరేష్, పేష్కార్ రామకృష్ణ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తిరుమలలో మంగళవారం రాత్రి పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది.
నిన్న రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
ఆలయ మాడ వీధుల్లో ఊరేగించిన మలయప్ప స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, బోర్డు సభ్యులు నరేష్, పేష్కార్ రామకృష్ణ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మలయప్ప స్వామివారికి భక్తులు మొక్కులు చెల్లించారు.
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు భారీగా తరలి వస్తున్నారు.
ప్రతిరోజు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 9 షెడ్లు సర్వదర్శన క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి.
కృష్ణతేజ విశ్రాంతి భవనం మీదుగా రింగురోడ్డులో శిలాతోరణం సర్కిల్, బాటగంగమ్మ సర్కిల్, ఆక్టోపస్ భవనం వరకు దాదాపు మూడు కిలోమీటర్ల వరకు భక్తులు క్యూ కట్టారు.
Updated Date - Oct 08 , 2025 | 10:26 AM