Ganesh immersions: హైదరాబాద్ ట్యాంక్ బండ్‌లో కొనసాగుతున్న గణేశ్ నిమజ్జనాలు
ABN, Publish Date - Sep 07 , 2025 | 01:47 PM
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. శనివారం రాత్రి నుంచి వచ్చిన విగ్రహాలకు ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా నిమజ్జనాలు చేస్తున్నారు. నిమజ్జనాలకు ఆలస్యం అవుతుండటంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ పక్కల ప్రాంతాల్లో గణనాథుల వాహనాలు బారులుదీరాయి. అయితే, 11రోజులపాటు జరిగిన వినాయక పూజల అనంతరం విగ్రహాల నిమజ్జనం కోలాహలంగా సాగింది. గణేశ్ విగ్రహాలను నిమజ్జనం కోసం భారీ లారీలు, ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోల ద్వారా తరలించారు. డీజేలతో యువకులు కేరింతలు, డ్యాన్సులు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. గణనాథుల నిమజ్జనం చూడటానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తులతో ట్యాంక్‌బండ్ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి.
11రోజులపాటు జరిగిన వినాయక పూజల అనంతరం విగ్రహాల నిమజ్జనం కోలాహలంగా సాగింది.
గణేశ్ విగ్రహాల నిమజ్జనం కోసం భారీ లారీలు, ట్రాక్టర్లు, ఆటోల ద్వారా భాగ్యనగరంలోని హుస్సేన్ సాగర్‌కు తరలించారు.
నిమజ్జనం కోసం బారులు తీరిన గణనాథులు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటోలతో అలంకరించిన గణేశ్ వాహనం
వ్యర్థాలతో నిడిపోయిన హుస్సేన్ సాగర్
వ్యర్థాలను సేకరిస్తున్న పారిశుధ్య కార్మికులు
హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనమైన గణనాథులు
గణేశ్ నిమజ్జనానికి ఆలస్యం అవుతుండటంతో లారీపై నిద్రపోతున్న యువకులు
హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనం
వినాయకుల నిమజ్జనాలను చూడటానికి వెళ్తున్న చిన్నారులు
హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనం
నిమజ్జనం కోసం తరలి వెళ్తున్నగణనాథుడు
హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనం
Updated Date - Sep 07 , 2025 | 02:04 PM