ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bathukamma Kunta: అంగరంగ వైభవంగా బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం

ABN, Publish Date - Sep 29 , 2025 | 07:35 AM

హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేటలో హైడ్రా పునరుద్ధరించిన ‘బతుకమ్మ కుంట’ను ఆదివారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నగర ప్రజలకు అంకితం చేశారు. బతుకమ్మ కుంటను ప్రారంభించడంతోపాటు పూజలు చేసి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.

1/16

హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేటలో హైడ్రా పునరుద్ధరించిన ‘బతుకమ్మ కుంట’ను ఆదివారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నగర ప్రజలకు అంకితం చేశారు.

2/16

బతుకమ్మ కుంటను ప్రారంభించడంతో పాటు పూజలు చేసి పట్టు వస్త్రాలు సమర్పించారు.

3/16

బతుకమ్మ కుంట ప్రారంబోత్సవానికి విచ్చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి ఛే నెంబర్‌ చౌరస్తా వద్ద వందలాది మంది మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికారు.

4/16

అక్కడి నుంచి బతుకమ్మ కుంట వరకు సీఎం కాలినడకన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

5/16

రాత్రి 7.30 గంటల సమయంలో బతుకమ్మ కుంటను ప్రారంభించారు.

6/16

ఆడబిడ్డలను మన సంతోషంలో భాగస్వామ్యం చేస్తేనే దసరా, బతుకమ్మ పండుగలకు నిండుదనం ఉంటుందని ఉద్ఘాటించారు సీఎం రేవంత్ రెడ్డి.

7/16

బతుకమ్మ కుంటకు మాజీ ఎంపీ వి.హనుమంతరావు పేరు పెట్టాలన్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ సూచన మేరకు ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

8/16

హైడ్రా కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన పాటను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు.

9/16

అంబర్‌పేటలో అన్ని ప్రభుత్వ ఆఫీసులు ఒకేచోట ఉండేలా మినీ సెక్రటేరియట్‌ లాంటి భవనాన్ని కట్టిస్తామని హామీ ఇచ్చారు.

10/16

బతుకమ్మ కుంట జలకళతో జీవకళను అలుముకుందని తెలిపారు సీఎం రేవంత్‌రెడ్డి.

11/16

నిన్నటి వరకు కబ్జాకోరల్లో చిక్కి, కుంచించుకుపోయి, తన అస్థిత్వమే ప్రశ్నార్ధకమైన అంబర్‌పేట బతుకమ్మ కుంట మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుందని వెల్లడించారు సీఎం రేవంత్‌రెడ్డి.

12/16

తన అలలపై ఆడబిడ్డల బతుకమ్మల ఒయలు ప్రదర్శిస్తూ గత వైభవాన్ని తిరిగి సాధించుకుందని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్‌రెడ్డి.

13/16

హైదరాబాద్ మహానగరంలో కబ్జా కోరల్లో చిక్కి అస్థిత్వం కోల్పోయే ప్రమాదంలో ఉన్న ప్రతి చెరువును తిరిగి పునరుద్ధరిస్తామని ఉద్ఘాటించారు.

14/16

లేక్ సిటీగా నగరాన్ని తీర్చిదిద్దుతామని నొక్కిచెప్పారు.

15/16

తమ ఆలోచనకు ఈ రోజు ప్రారంభించుకున్న బతుకమ్మకుంట తొలి అడుగని చెప్పుకొచ్చారు.

16/16

ఈ బతుకమ్మ కుంట ప్రారంభోత్సవంలో మహిళలను భాగస్వామ్యం చేయడం సంతోషం కలిగిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు

Updated Date - Sep 29 , 2025 | 07:49 AM