ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తిరుమలకు ముఖ్యమంత్రిగా కాదు... భక్తుడిగానే వెళ్తా: సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Nov 27 , 2025 | 07:47 PM

అమరావతిలోని వెంకటపాలెంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు గురువారం భూమిపూజ చేశారు. రూ. 260 కోట్లతో రెండు దశల్లో పనులు చేపట్టనున్నారు. ఆలయ ప్రాకారం, మహారాజగోపురం, ఆంజనేయస్వామి ఆలయం నిర్మించనున్నారు. మాడవీధులు, అన్నదాన కాంప్లెక్స్‌ నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు.

1/12

దేవతల రాజధాని ఎలా ఉంటుందో.. అదే నమూనాతో ఏపీ రాజధాని అమరావతి ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

2/12

రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని.. ఈ పవిత్ర కార్యక్రమానికి రైతులు సహకరించారని అభినందించారు.

3/12

అమరావతిలోని వెంకటపాలెంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు గురువారం భూమిపూజ చేశారు.

4/12

రూ. 260 కోట్లతో రెండు దశల్లో పనులు చేపట్టనున్నారు. ఆలయ ప్రాకారం, మహారాజగోపురం, ఆంజనేయస్వామి ఆలయం నిర్మించనున్నారు. మాడవీధులు, అన్నదాన కాంప్లెక్స్‌ నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు.

5/12

తొలి దశలో రూ.140 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందులో రూ. 92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారాన్ని నిర్మిస్తారు.

6/12

రూ. 48 కోట్లతో ఏడంతస్తుల మహా రాజగోపురం, ఆర్జిత సేవా మండపం, వాహన మండపం, రథ మండపం, పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మిస్తారు.

7/12

రెండో దశలో శ్రీవారి ఆలయ మాడ వీధులు, అప్రోచ్ రోడ్డు, అన్నదానం కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు, సిబ్బంది క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలన భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ వంటి పనుల్ని చేపడతారు. వీటికి రూ. 120 కోట్ల వ్యయం కానుంది.

8/12

2014 - 19 మధ్య టీడీపీ ప్రభుత్వం శ్రీవారి ఆలయాన్ని రూ. 185 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.

9/12

కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. దానిని రూ. 36 కోట్లకు కుదించింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి.. ఆలయాన్ని గతంలో రూపొందించిన ప్రణాళికను మించి సకల హంగులతో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

10/12

1983లో తిరుమలలో అన్నదానాన్ని ఎన్టీఆర్ ప్రారంభిస్తే.. 2003లో ప్రాణదానం కార్యక్రమాన్ని స్విమ్స్‌లో ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

11/12

‘మా ఇంటి దైవం వేంకటేశ్వర స్వామి... మా ఇంటి నుంచి చూస్తే ఆయన నామాలు కనిపిస్తాయి’ అని చెప్పారు.

12/12

ఎప్పుడూ కూడా వేంకటేశ్వర స్వామికి అప్రతిష్ట పాలు తెచ్చే పనిని చెయ్యనని.... ఎవరినీ చేయనివ్వనని స్పష్టం చేశారు. వేంకటేశ్వర స్వామి వద్దకు ఎప్పుడు వెళ్ళినా క్యూ లైన్‌లోనే వెళతానని తెలిపారు. ముఖ్యమంత్రిగా కాదు... భక్తుడిగానే వెళ్తానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - Nov 27 , 2025 | 07:55 PM