ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Vijayawada Utsav:స్పెషల్‌గా విజయవాడ ఉత్సవ్.. లోగో ఆవిష్కరణ

ABN, Publish Date - Sep 08 , 2025 | 07:21 AM

విజయవాడ ఉత్సవ్ కర్టెన్ రైజర్ ఈవెంట్ కార్యక్రమం నిన్న(ఆదివారం) విజయవాడలోని మురళి రిసార్ట్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ ఉత్సవ్ ఏవీ, ఈవెంట్లకు సంబంధించిన లోగో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు.

1/17

విజయవాడ ఉత్సవ్ కర్టెన్ రైజర్ ఈవెంట్ కార్యక్రమం నిన్న(ఆదివారం) విజయవాడలోని మురళి రిసార్ట్స్‌లో జరిగింది.

2/17

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీరామతాతయ్య, తంగిరాల సౌమ్య బోడె ప్రసాద్, బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహనరావు, కృష్ణామిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు, ప్రెస్ ఆకాడమీ చైర్మన్ అలపాటి సురేష్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, సినీతారలు మానస వారణాసి, అనుపమ పరమేశ్వరన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సంయుక్త మీనన్, దివి వధ్య, తదితరులు పాల్గొన్నారు.

3/17

సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న కళాకారులు

4/17

విజయవాడ ఉత్సవ్ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు.

5/17

ఈ ఉత్సవంలో అనేక ఈవెంట్లు జరుగుతాయని ఎంపీ శివనాథ్ పేర్కొన్నారు. ఒక్కో ఈవెంట్‌కు ఒక్కో ప్రత్యేకత ఉండేలా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

6/17

ఈ కార్యక్రమంలో విజయవాడ ఉత్సవ్ ఏవీ, ఈవెంట్లకు సంబంధించిన లోగో ఆవిష్కరించారు.

7/17

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

8/17

దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రేయాస్ మీడియా సంస్థ సహకారంతో ప్రతిష్ఠాత్మకంగా ‘విజయవాడ ఉత్సవ్’ అంగరంగ వైభవంగా జరుగనుందని ఎంపీ శివనాథ్ చెప్పుకొచ్చారు.

9/17

పర్యాటక రంగానికి ప్రోత్సాహం అందించే లక్ష్యంతో వినోద భరిత కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, క్రీడా పోటీలను నిర్వహించనున్నామని ఎంపీ శివనాథ్ తెలిపారు.

10/17

విజయవాడను వైబ్రెంట్ సిటీగా మార్చుతామని ఎంపీ శివనాథ్ ఉద్ఘాటించారు.

11/17

11 రోజుల పాటు అంగరంగ వైభవంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తామని ఎంపీ శివనాథ్ వెల్లడించారు.

12/17

అన్ని రంగాల వారిని ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేస్తున్నామని ఎంపీ శివనాథ్ వివరించారు.

13/17

సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎంపీ శివనాథ్ పేర్కొన్నారు.

14/17

కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు

15/17

విజయవాడలో మొదటిసారి నిర్వహిస్తున్న ఈ ఉత్సవానికి అందరూ సహకరించాలని ఎంపీ శివనాథ్ కోరారు.

16/17

రానున్న కాలంలో కూడా ఈ విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహిస్తామని ఎంపీ శివనాథ్ తెలిపారు.

17/17

సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కృష్ణానది తీరం, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాల, ఇందిరాగాంధీ మైదానం, గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ మైదానాల్లో విజయవాడ ఉత్సవ్ వేడుకలు నిర్వహిస్తామని ఎంపీ శివనాథ్ పేర్కొన్నారు.

Updated Date - Sep 08 , 2025 | 07:37 AM