Sri Sathya Sai Centenary Celebrations: శ్రీ సత్యసాయి జయంత్యుత్సవాల్లో ప్రధాని మోదీ
ABN, Publish Date - Nov 19 , 2025 | 05:23 PM
శ్రీసత్యసాయి జయంత్యుత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో ఆయన పాల్గోన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి బాబా జీవించారన్నారు. భౌతికంగా బాబా లేకున్నా.. ఆయన ప్రేమ మనతోనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన రూ. 100 నాణెం, 4 తపాలా బిళ్లలను ప్రధాని మోదీ ఆవిష్కరించారు.
శ్రీసత్యసాయి జయంత్యుత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో ఆయన పాల్గోన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి బాబా జీవించారన్నారు.
భౌతికంగా బాబా లేకున్నా.. ఆయన ప్రేమ మనతోనే ఉందన్నారు.
సత్యసాయ బోధనల ప్రభావం దేశమంతా కనిపిస్తోందని తెలిపారు. కోట్ల మంది ఆయన భక్తులు మానవ సేవ చేస్తున్నారని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేశారు.
సత్యసాయి ప్రేమ సూత్రాలు ఎందరినో ఆలోచింప చేశాయని పేర్కొన్నారు.
సత్యసాయి బాబా బోధనలు అక్షల మందికి మార్గం చూపాయని వివరించారు. అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు.. ఇదే ఆయన నినాదమని చెప్పారు. చాలా మంది జీవితాలను సత్యసాయి సమూలంగా మార్చేశారన్నారు. లక్షల మందిని సేవామార్గంలో నడిపించారని పేర్కొన్నారు.
ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు.. తాగునీరు, వైద్యం, విద్య తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించారన్నారు. పుట్టపర్తి పవిత్ర భూమిలో ఏదో మహత్తు ఉందన్నారు. సత్యసాయి సంస్థలన్నీ ఇలాగే ప్రేమను పంచుతూ వర్థిలాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సత్యసాయి జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన రూ. 100 నాణెం, 4 తపాలా బిళ్లలను ప్రధాని మోదీ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనగాని సత్యప్రసాద్ తదితరలు పాల్గొన్నారు.
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి శతజయంతి వేడుకల్లో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాలు ఆహ్వానితులను కట్టిపడేశాయి. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా పుట్టపర్తిలో భారీగా భద్రతా దళాలను మోహరించారు.
భూమిపై మనం చూసిన దైవ స్వరూపం శ్రీసత్యసాయి బాబా అని సీఎం చంద్రబాబు తెలిపారు.
శ్రీసత్యసాయి బాబా.. ప్రజల కోసం చేసిన సేవలను ఏపీ మంత్రి నారా లోకేశ్, క్రిెకెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ వివరించారు. ఆయనలోని దైవత్వాన్ని సైతం కొనియాడారు
ఈ జయంత్యుత్సవాల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకొన్నాయి.
శివమణి డ్రమ్స్‌తో చేసిన విన్యాసం అందరిని అలరించింది.
పుట్టపర్తి ప్రజలు.. ప్రధాని మోదీకి రహదారులకు ఇరువైపులా నిలబడి స్వాగతం పలికారు.
Updated Date - Nov 19 , 2025 | 05:26 PM