PM Modi Srisailam Visit: శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్న ప్రధాని మోదీ
ABN, Publish Date - Oct 16 , 2025 | 03:36 PM
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్న ప్రధాని మోదీ
దేవస్థానం ప్రధాన ద్వారం వద్ద మోదీకి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికిన వేద పండితులు
విభూతి, కుంకుమ ధరింపజేసి ప్రదక్షిణకార మార్గంలో ఆలయ అంతర్భాగానికి మోదీని ఆహ్వానించిన ఆలయ పండితులు
శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని
పూజలో భాగంగా ప్రధాన మంత్రి మోదీకి శేష వస్త్రాలు అందించిన ఆలయ పూజారులు
మల్లికార్జునస్వామికి పంచామృతాలతో ప్రధాని మోదీ రుద్రాభిషేకం
భ్రమరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజల్లో పాల్గొన్న ప్రధాని
స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించిన మోదీ
స్వామి, అమ్మవార్ల చిత్రపటాలను మోదీకి అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ప్రధాన మంత్రి మోదీకి ఆశీర్వాదాలను అందించిన ఆలయ అర్చకులు
Updated Date - Oct 16 , 2025 | 03:36 PM