NEET Exam: తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా నీట్.. పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
ABN, Publish Date - May 05 , 2025 | 07:38 AM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన నీట్ పరీక్షకు తొంభై ఐదు శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పరీక్షా కేంద్రాల లోపలకు అనుమతించే సమయంలో విద్యార్థులను పోలీస్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. గడియారాలు, ఇతర గాడ్జెట్లను తీసివేయించారు. ఎప్పటిలాగానే.. ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనను కచ్చితంగా అమలు చేశారు. పలురకాల కారణాలతో సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోయిన విద్యార్థులు లోపలకు అనుమతించాలంటూ సిబ్బందిని బతిమిలాడుకున్నా ఉపయోగం లేకపోయింది. దీంతో విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు. పలు కేంద్రాల్లో నీట్ పరీక్ష రాసేందుకు తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. కొంతమంది విద్యార్థులు మూడు నిమిషాలు ఆలస్యంగా రావడంతో లోపలికి అనుమతించలేదు.
Updated Date - May 05 , 2025 | 08:04 AM