Lokesh Blesses Ram Mohan Naidu Son: కేంద్రమంత్రి కుమారుడిని ముద్దాడిన నారా లోకేష్..!
ABN, Publish Date - Sep 09 , 2025 | 05:15 PM
ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరుగుతున్న సందర్భంగా ఢిల్లీ వెళ్లిన మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు జన్మించిన బాబుకి లోకేష్ ఆశీస్సులు అందజేశారు.
కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు ఆగస్టు 12వ తేదీన కుమారుడు జన్మించాడు.
నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరుగుతున్న సందర్భంగా ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు.
ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు జన్మించిన బాబుకి తన ఆశీస్సులు అందజేశారు.
రామ్మోహన్ నాయుడుకి పుట్టిన వారసుడిని ఎత్తుకుని ముద్దాడారు.
అక్కడే ఉన్న మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి సతీమణి, శ్రావ్య తల్లి అయిన బండారు మాధవీలతని లోకేష్ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు మిహిర అన్వి శివంకృతి అనే కుమార్తె కూడా ఉంది.
Updated Date - Sep 09 , 2025 | 05:17 PM