ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nara Lokesh: మంగళగిరిలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి నారా లోకేష్

ABN, Publish Date - Apr 04 , 2025 | 11:04 AM

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో లోకేష్ పాల్గొన్నారు. ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో భాగంగా మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.

1/9

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు.

2/9

నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో లోకేష్ పాల్గొన్నారు.

3/9

‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో భాగంగా మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.

4/9

మంగళగిరి నియోజకవర్గంలో పేదల దశాబ్దాల కల నెరవేరిందని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు.

5/9

‘పేదలకు పట్టాభిషేకం’ ప్రారంభమైందని.. మొదటి విడతలో శాశ్వత హక్కు కల్పిస్తూ 3 వేల ఇళ్ల పట్టాలు అందిస్తున్నానని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.

6/9

ఉండవల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు మొదటి పట్టా అందజేశానని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాజమండ్రి గోవిందు, సీతామహాలక్ష్మి అనే దంపతులు ఇద్దరు బిడ్డలతో ఉండవల్లిలో నివాసం ఉంటున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు.

7/9

ఏళ్ల క్రితం ఉండవల్లి అమరారెడ్డి నగర్‌లోని ఓ స్థలంలో వారు చిన్న ఇల్లు నిర్మించుకుని ఉంటున్నారని మంత్రి నారా లోకేష్ చెప్పారు.

8/9

రజక కులానికి చెందిన గోవిందు డ్రైవర్‌గా పనిచేస్తుండగా, భార్య సీతామహాలక్ష్మి బట్టలు ఉతకడం, ఇస్త్రీ పనిచేసి బిడ్డలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. తాము ఉంటున్న స్థలానికి పట్టా ఇప్పించాలని గతంలో వారు ఎందరో ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని మంత్రి నారా లోకేష్ చెప్పారు.

9/9

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి పది నెలల్లోనే దశాబ్దాల సమస్యను పరిష్కరించామని మంత్రి నారా లోకేష్ అన్నారు. తాను ఇచ్చిన హామీ మేరకు నేరుగా వారి ఇంటికి వెళ్లి బట్టలు పెట్టి మరీ శాశ్వత ఇంటి పట్టాను అందజేశానని చెప్పారు. పట్టా అందుకున్న కుటుంబ సభ్యుల కళ్లలో ఆనందం మాటల్లో వివరించలేనని మంత్రి నారా లోకేష్ అన్నారు.

Updated Date - Apr 04 , 2025 | 12:03 PM