Mahanadu 2025: మహానాడులో ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - May 27 , 2025 | 10:09 PM
కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు ఘనంగా ప్రారంభమైంది. మహానాడు ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంత్రులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అందరికీ అభివాదం చేస్తూ సీఎం మహానాడు వేదిక వద్దకు చేరుకున్నారు. మహానాడు వేడుకలో ఫొటో ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. టీడీ జనార్దన్, శ్రీపతి సతీష్ ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. మహానాడులో తొలిసారిగా డిజిటల్ ఫార్మాట్‌లో ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫొటో ప్రదర్శన ప్రతి ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎన్టీఆర్‌కు సంబంధించిన జీవిత చరిత్ర విశేషాల పుస్తకాలతో పాటు ఎన్టీఆర్ అసెంబ్లీలో ప్రసంగించిన ముఖ్యమైన ఘటనల పుస్తకాలను కూడా ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు.
కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంత్రులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
మహానాడు వేడుకలో ఫొటో ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
టీడీ జనార్దన్, శ్రీపతి సతీష్ ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. మహానాడులో తొలిసారిగా డిజిటల్ ఫార్మాట్‌లో ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు.
ఈ ఫొటో ప్రదర్శన ప్రతి ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఎన్టీఆర్‌కు సంబంధించిన జీవిత చరిత్ర విశేషాల పుస్తకాలతో పాటు ఎన్టీఆర్ అసెంబ్లీలో ప్రసంగించిన ముఖ్యమైన ఘటనల పుస్తకాలను కూడా ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు.
అంతకుముందు మహానాడు ప్రాంగణానికి చేరుకున్న వెంటనే.. చిత్తూరు పార్లమెంట్ ప్రతినిధుల నమోదు కేంద్రంలో అధినేత చంద్రబాబు పేరు నమోదు చేసుకున్నారు.
Updated Date - May 27 , 2025 | 10:15 PM