Prime Minister Narendra Modi: ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
ABN, Publish Date - Oct 16 , 2025 | 12:13 PM
ఏపీ పర్యటనకు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి కర్నూలు విమానాశ్రయంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్.. సాదర స్వాతం పలికారు.

విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో సున్నిపెంట వెళ్లిన ప్రధాని.. రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. మధ్యాహ్నం మల్లన్న సన్నిధిలో పూజలు చేశారు.
శ్రీశైల మల్లికార్జున ఆలయంలో పూజల అనంతరం.. హెలికాప్టర్‌లో నన్నూరుకు చేరకున్న ప్రధాని.. రాగమయూరి గ్రీన్ హిల్స్ వద్ద ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్’ బహిరంగ సభలో పాల్గొనున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా వృద్ధికి తోడ్పడే ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. కాగా, ప్రధాని మోదీ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో రూ.13,430 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. సభ అనంతరం సాయంత్రం 4:45కు ప్రధాని మోదీ ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు.
Updated Date - Oct 16 , 2025 | 12:13 PM