ఉడుపి శ్రీకృష్ణ మఠంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
ABN, Publish Date - Dec 07 , 2025 | 09:52 PM
కర్ణాటకలోని ఉడుపిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదివారం (07-12-2025) పర్యటించారు. పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం ఆధ్వర్యంలో భగవద్గీత గొప్పతనాన్ని వివరించేందుకు బృహత్ గీతోత్సవ్ పేరిట కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కర్ణాటకలోని ఉడుపిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదివారం (07-12-2025) పర్యటించారు.
పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం ఆధ్వర్యంలో భగవద్గీత గొప్పతనాన్ని వివరించేందుకు బృహత్ గీతోత్సవ్ పేరిట కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఉడుపిలోని శ్రీకృష్ణ దేవాలయాన్ని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ధర్మాన్ని మీరు కాపాడితే.. అది మిమ్మల్ని కాపాడుతుందన్నారు.
తన గోశాలలో 60 ఆవులు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ఆవులను సంరక్షించేందుకు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు.
ఉడుపిలోని శ్రీకృష్ణుడి దేవాలయంలో ఆయన కలియ తిరిగారు. ఈ సందర్భంగా ఆలయంలోని విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
శ్రీకృష్ణ మఠం మఠాధిపతి పరమ పూజ్య శ్రీసుగుణేంద్ర తీర్థ స్వామిజీ ఆశీర్వచనాన్ని పవన్ కల్యాణ్ తీసుకున్నారు.
ఈ పర్యటనలో పవన్ కల్యాణ్ వెంట.. ఆయన స్నేహితుడు ఆనందసాయి ఉన్నారు.
Updated Date - Dec 07 , 2025 | 09:52 PM