CM Chandrababu: ప్రపంచ జనాభా దినోత్సవం సమ్మిట్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
ABN, Publish Date - Jul 12 , 2025 | 08:50 AM
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన మొదటి అమరావతి సమ్మిట్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ‘జనాభా నిర్వహణ విధానం- ప్రతి కుటుంబం ముఖ్యం - మీ అభిప్రాయం మార్గదర్శనం’ అనే భావనతో రూపొందించిన సర్వేను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు.
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన మొదటి అమరావతి సమ్మిట్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.
‘జనాభా నిర్వహణ విధానం- ప్రతి కుటుంబం ముఖ్యం - మీ అభిప్రాయం మార్గదర్శనం’ అనే భావనతో రూపొందించిన సర్వేను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
జనమే బలమని, జనాభా పెరుగుదలకు త్వరలో మంచి పాలసీ తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్గాటించారు.
సదస్సుకు హాజరైన ప్రముఖులు
సదస్సులో మాట్లాడుతున్న యువతులు
జనాభా ఎప్పటికీ భారం కాదని... అదే మనకు తిరుగులేని ఆస్తి అని సీఎం చంద్రబాబు తెలిపారు.
సదస్సులో మాట్లాడుతున్న ప్రముఖులు
140 కోట్ల జనాభాతో మన దేశం చైనాను వెనక్కు నెట్టిందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా జనాభాతోపాటు జననాల రేటు కూడా తగ్గిపోతోందని ముఖ్యమంత్రి వెల్లడించారు.
‘దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్’ అని చెప్పిన గురజాడ అప్పారావు స్ఫూర్తితో ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఒకప్పుడు తాను కుటుంబ నియంత్రణను ప్రోత్సహించానని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ఇప్పుడు జనాభా వృద్ధి కావాలని కోరుతున్నానని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.
సీఎం చంద్రబాబుతో ఫొటో దిగుతున్న మహిళలు
దేశానికి బలమైన ఆర్థిక వనరు జనాభాయే అని సీఎం చంద్రబాబు నొక్కి చెప్పారు.
సీఎం చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఆసక్తిగా వింటున్న మహిళలు
సదస్సులో మాట్లాడుతున్న వక్తలు
జనాభా నియంత్రణపై కాదు.. నిర్వహణపై దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
Updated Date - Jul 12 , 2025 | 08:55 AM