TANA Distributes School Bags: తానా ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగుల పంపిణీ
ABN, Publish Date - Sep 22 , 2025 | 09:33 PM
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) న్యూయార్క్ టీం ఆధ్వర్యంలో వాయండాన్చ్ (Wyandanch) యూనియన్ ఫ్రీ స్కూల్ డిస్ట్రిక్ట్‌లో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. రాజా కసుకుర్తి సహాయంతో దాదాపు 100 మంది స్కూల్ విద్యార్థులకు బ్యాక్ ప్యాక్‌లు, స్కూల్ సామగ్రిని అందజేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) (TANA), న్యూయార్క్ టీం (New York Team) ఆధ్వర్యంలో వాయండాన్చ్ (Wyandanch) యూనియన్ ఫ్రీ స్కూల్ డిస్ట్రిక్ట్‌లో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు (School Bags) పంపిణీ చేశారు. రాజా కసుకుర్తి సహాయంతో దాదాపు 100 మంది స్కూల్ విద్యార్థులకు బ్యాక్ ప్యాక్‌లు, స్కూల్ సామగ్రిని అందజేశారు.
అమెరికాలోని కమ్యూనిటీకి తమ వంతుగా సేవలందించాలన్న ఉద్దేశ్యంతో తానా అధ్యక్షులు నరేన్ కొడాలి (Naren Kodali) నాయకత్వంలో కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని (Sai Bolli Neni) సహకారంతో తానా ఈ బ్యాక్ ప్యాక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తానా ప్రతినిధులు తెలిపారు. తానా న్యూయార్క్ ప్రాంతీయ ప్రతినిధి శ్రీనివాస్ భర్తవరపు ఈ సందర్భంగా స్కూల్ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తానా న్యూయార్క్ ప్రాంతీయ ప్రతినిధి శ్రీనివాస్ భర్తవరపు, తానా ప్రోగ్రాం సమన్వయకర్తలు సుచరిత అనంతనేని, రజిత కల్లూరి, జితేంద్ర యార్లగడ్డ, దిలీప్ ముసునూరు, ప్రసాద్ కోయి, శ్రీనివాస్ నాదెళ్ల ఎంతో కృషి చేశారు.
తానా కిడ్స్ సుదీక్ష ముసునూరు, సుహాస్ ముసునూరు, సమన్విత మిన్నెకంటి, ఆశ్రిత కోయి, శరణ్ సాయి భర్తవరపు, గీతికా చల్ల, రజిత్ రెడ్డి, రమ్యరెడ్డి, లోహితాక్ష సాయి నాదెళ్ల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన కమ్యూనిటీ లీడర్ ప్రసాద్ కంభంపాటి తానా సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వాయండాన్చ్ (Wyandanch) యూనియన్ ఫ్రీ స్కూల్ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ అఫ్ స్కూల్స్, స్థానిక స్కూల్ అధికారులు, టీచర్లు మాట్లాడారు. కమ్యూనిటీకి తానా చేస్తున్నసేవా కార్యక్రమాలను ప్రశంసించారు. తానా బ్యాక్ ప్యాక్ కార్యక్రమం కింద తమ స్కూల్‌ను ఎంపిక చేసి విద్యార్థులకు స్కూల్ బ్యాగ్‌లను పంపిణీ చేసినందుకు వారు తానా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
అమెరికాలో ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమి ఛైర్మన్ రవి మందలపునకు ఘన సన్మానం
సౌదీ అరేబియాలో పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ సభ
For More NRI News And Telugu News
Updated Date - Sep 22 , 2025 | 09:41 PM