Bride Warning: గదిలోకి కత్తితో వెళ్లిన నవ వధువు.. కంగుతిన్న వరుడు
ABN, Publish Date - Jun 25 , 2025 | 10:34 AM
వివాహమైంది. తొలి రాత్రి గదిలోకి పెళ్లి కూతురు పాల గ్లాస్‌తో వస్తుందని వరుడు భావించాడు. ఆమె గదిలోకి వచ్చింది. కానీ ఆమె చేతిలో పాల గ్లాసు లేదు. కత్తితో గదిలోకి వచ్చింది. దీంతో ఆ వరుడు కంగుతిన్నాడు.
న్యూఢిల్లీ, జూన్ 25: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక భర్తను దారుణంగా హత్య చేసి సిమెంట్ డ్రమ్‌లో కప్పెంటింది భార్య. ఈ ఘటన మరువక ముందే హనీమూన్ పేరుతో మేఘాలయాలో భర్తను చంపిందీ ఇండోర్‌కు చెందిన మరో యువతి. ఈ ఘటన నుంచి తెరుకోకముందే.. ఏపీలో తేజేశ్వర్‌ను ప్రియుడితో కలిసి భార్య దారుణంగా హత్య చేయించింది. వరుసగా జరుగుతోన్న ఈ తరహా ఘటనలతో దేశంలోని ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. అలాంటి వేళ ఒక కొత్త వధువు.. తొలి రాత్రి గదిలోకి పాల గాస్లుతో కాకుండా కత్తిని తీసుకు వెళ్లి భర్తను చంపేస్తానంటూ బెదిరించింది.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో చోటు చేసుకుంది. నిషాద్ అనే వ్యక్తికి ఇటీవల సితార అనే యువతితో వివాహమైంది. వివాహ సమయంలో సంతోషంగా వ్యవహరించిన ఆమె.. తొలి రాత్రి మాత్రం చాలా వింతగా ప్రవర్తించింది. గదిలోకి కత్తిని తీసుకొచ్చి.. నన్ను తాకితే 35 ముక్కలు చేస్తానంటూ అతడిని బెదిరించింది. తనకు ఈ వివాహం ఇష్టం లేదని తాళికట్టిన భర్తకు స్పష్టం చేసింది. అమన్ అనే వ్యక్తిని తాను ప్రేమిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయం బహిర్గతం చేస్తే.. నీతోపాటు మీ కుటుంబ సభ్యులపై తప్పుడు కేసు పెడతానంటూ బెదిరించింది.
ఈ విషయాన్ని నిషాద్.. తన కుటుంబ సభ్యులకు వివరించాడు. దీంతో ఆ మురునాడే పెద్దల ఎదుట పంచాయతీ పెట్టారు. ఆ క్రమంలో సితారకు ఆమె కుటుంబ సభ్యులు నచ్చ చెప్పారు. అనంతరం ఆమెను నిషాద్ ఇంటికి తీసుకువెళ్లాడు. అయినప్పటికీ అక్కడ ఆమె వేధింపులు మాత్రం ఆగలేదు. దీంతో వరుడు కుటుంబం విసిగిపోయి.. పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు సితార తన ప్రియుడు అమన్‌తో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. సితారకు అమన్ వరుసకు మేనల్లుడు అవతాడని పోలీసులు వివరించారు. సితార ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి..
భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవదహనం
తెల్ల జుట్టు నల్లగా మారాలంటే.. ఈ రసం తాగాలి..
For National News And Telugu News
Updated Date - Jun 25 , 2025 | 02:38 PM