Share News

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవదహనం

ABN , Publish Date - Jun 25 , 2025 | 09:27 AM

దేశ రాజధాని న్యూఢిల్లీలోని మెట్రో స్టేషన్ వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనమయ్యారు.

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవదహనం
Fire Accident in delhi

న్యూఢిల్లీ, జూన్ 25: దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక రిఠాలా మెట్రో స్టేషన్ సమీపంలోని ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది 16 ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. అయితే పరిసర ప్రాంతాలను దట్టమైన పొగ ఆవరించింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


ఇక ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి సైతం ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బాధిత కుటుంబాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

‘ఉచిత ప్రయాణం’ కోసం 2 వేల బస్సులు కొనాలి

అంతరిక్షంలోకి మరో భారతీయుడు.. ఇతనెవరో తెలుసా

For National News And Telugu News

Updated Date - Jun 25 , 2025 | 02:59 PM