ఉదయం ఉసిరి రసం తాగడం వల్ల బరువు తగ్గొచ్చు. షుగర్ నియంత్రణ అవుతుంది. అలాగే జీవక్రియ రేటు పెరుగుతుంది.
ఈ రసంలో కొంచెం మిరియాల పొడి కలిపి తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి ఉసిరికాయ, ఆమ్లా రసం ఒక వరంలా పని చేస్తుంది. అందుకోసం ఈ రసాన్ని మూడు నుండి నాలుగు నెలల పాటు ప్రతి రోజు క్రమం తప్పకుండా తీసుకోవాలి.
ఈ రసంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల ఆమ్లా రసం కలిపి తాగితే ప్రయోజనకరంగా ఉంటుంది.
ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ఈ రసం తాగితే పోషక లోపం దరిచేరదు. రోగనిరోధకశక్తిని పెంచుతోంది. సీజనల్ ఇన్ఫెక్షన్ల రిస్క్ సైతం తగ్గుతుంది. మలబద్దకం, అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఉసిరి తింటే చర్మం ఎలాస్టిసిటీ పెరుగుతుంది. దీంతో ముడతలు త్వరగా రావు.
ఉదయాన్నే ఉసిరి రసం తాగడం వల్ల కిడ్నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాలేయ వాపు సమస్య తగ్గుతుంది.