Encounter: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు మృతి.. కొనసాగుతున్న కూంబింగ్
ABN, Publish Date - Jun 20 , 2025 | 11:20 AM
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడి పరారైనట్లు తెలుస్తోంది. వీరి కోసం భద్రతా దళాల కూంబింగ్ కొనసాగుతోంది.
రాయ్‌పూర్, జూన్ 20: ఛత్తీస్‌గఢ్ కాంకెర్ జిల్లాలోని చోటే బెట్టియా పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. పలువురు మావోయిస్టులు తీవ్ర గాయ పడినట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున కాంకేర్ జిల్లా అడువుల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు భద్రతా బలగాలకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో వారు కూబింగ్ చేపట్టారు.
భద్రతా దళాల రాకను గమనించిన మావోయిస్టులు.. వారిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు సైతం ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. అలాగే మరికొందరు మావోయిస్టులు గాయాలతో తప్పించుకున్నారని చెప్పారు. తప్పించుకున్న మావోల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.
ఇదిలాఉంటే.. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో భారీగా ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లలో వందలాది మంది మావోలు హతమైన విషయం తెలిసిందే.
2026, మార్చి నెలాఖరు నాటికి దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. అందులోభాగంగా కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. మావోయిస్టులు లొంగిపోయి.. జన జీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధికి దోహదపడాలని పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో వందలాది మంది మావోలు పోలీసుల ఎదుట లోంగిపోయారు. అదే సమయంలో పలువురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు.. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని రంప చోడవరం ఏరియా ఆసుపత్రిలోని మావోయిస్టు మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తయింది. గాజర్ల రవి అలియాస్ ఉదయ్ భూపాలపల్లి జిల్లాకు.. అలాగే విశాఖ జిల్లా పెందుర్తికు అరుణ, ఛత్తీస్‌గఢ్‌కు అంజు మృతదేహలను తరలించి.. వారి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లామ్నుంథెం సింగ్సన్‌కు కడసారి వీడ్కోలు.. భారీగా తరలి వచ్చిన ప్రజలు
ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు.. గిఫ్ట్‌లు వైరల్
For National News And Telugu News
Updated Date - Jun 20 , 2025 | 04:28 PM