PM Modi: ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు.. గిఫ్ట్‌లు వైరల్
ABN , Publish Date - Jun 20 , 2025 | 08:45 AM
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల వివిధ దేశాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా దేశాల్లోని ప్రముఖులకు బహుమతులు అందజేశారు. ఆ బహుమతులు వైరల్ అయ్యాయి.
న్యూఢిల్లీ, జూన్ 20: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మూడు దేశాల్లో పర్యటించి స్వదేశానికి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయా దేశాల్లోని ప్రముఖులకు ప్రధాని మోదీ అరుదైన బహుమతులు అందించారు. ఆ క్రమంలో క్రొయేషియా అధ్యక్షుడు జోరాన్ మిలనోవిక్‌కు పట్టచిత్ర (వస్త్ర చిత్రం) పెయింటింగ్‌తోపాటు సిల్వర్ క్యాండిల్ స్టాండ్‌ను బహుకరించారు. అలాగే సైప్రస్ ఫస్ట్ లేడీ ఫిలిప్పా కర్సెరాకు సైతం వెండి పర్సును బహుమతిగా అందించారు. ఆ బహుమతులకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ సిల్వర్ క్యాండిల్ స్టాండ్‌పై రాజస్థాన్ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా రూపొందించారు. ఇక పట్టచిత్ర పెయింటింగ్‌లో ఒడిశాలోని పూరీ జగన్నాథ్ సంస్కృతితోపాటు ‘ఒడియా అస్మిత’కి తెలియజేసే విధంగా తయారు చేశారు. అలాగే వెండి పర్సు.. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో హస్తకళ సంస్థలో తయారు చేశారు. ఈ సిల్వర్ క్లచ్ పర్స్ రెపౌస్సే (repoussé) టెక్నిక్‌తో తయారు చేశారు. అయితే పట్టచిత్రను క్రొయేషియా అధ్యక్షుడుకు బహుకరించడం పట్ల ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ సంతోషం వ్యక్తం చేశారు. ఒడిశా సంస్కృతి, సంప్రదాయానికి ప్రధాని మోదీ గుర్తింపు తెచ్చారని పేర్కొన్నారు.

మరోవైపు విదేశాల్లోని నేతలకు ఈ బహుమతులు అందించడంపై బీజేపీ నేతలు సైతం స్పందించారు. వోకల్ ఫర్ లోకల్, ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం ద్వారా స్థానిక హస్తకళలను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఇచ్చారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ సైప్రస్, కెనడా, క్రొయేషియా దేశాల్లో పర్యటించారు. అందుకోసం జూన్ 15వ తేదీన ఆయన సైప్రస్ బయలుదేరి వెళ్లారు. అనంతరం కెనడాలోని జీ 7 సదస్సులో పాల్గొన్నారు. అనంతరం క్రొయేషియా వెళ్లి.. అటు నుంచి జూన్ 19వ తేదీన ప్రధాని మోదీ స్వదేశానికి తిరిగి వచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు.. గిఫ్ట్‌లు వైరల్
రాహుల్ గాంధీ పాకిస్థాన్ ఏజెంట్‌లా ప్రవర్తిస్తున్నారు: ఏక్‌నాథ్ షిండే
For National News And Telugu News