ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Plan Crash: లండన్‌లో సెటిల్ అవుదామని మొత్తం ఫ్యామిలీతో ఫ్లైట్ ఎక్కింది

ABN, Publish Date - Jun 12 , 2025 | 10:04 PM

ఇది మరో హృదయ విదారక ఘటన. ఈ విమాన ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన మొత్తం కుటుంబం మరణించింది. డాక్టర్ కోమి వ్యాస్ అనే ఆమె, రాజస్థాన్‌కు చెందిన ఒక పేరుమోసిన డాక్టర్. ఆమె తన భర్త, ముగ్గురు పిల్లలతో లండన్‌కు మకాం మార్చడానికి..

Plan Crash Doctor Family

ఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కూలిపోయిన ఘటనలో ఇది మరో హృదయ విదారక ఘటన. ఈ ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన మొత్తం కుటుంబం మరణించింది. డాక్టర్ కోమి వ్యాస్ అనే ఆమె, రాజస్థాన్‌కు చెందిన ఒక పేరుమోసిన డాక్టర్. ఆమె తన భర్త, ముగ్గురు పిల్లలతో లండన్‌కు మకాం మార్చడానికి రెండు రోజుల ముందే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. లండన్ కు ప్రయాణించే క్రమంలో విమాన ప్రమాదంలో మొత్తం ఫ్యామిలీ అసువులుబాసినట్టు తెలుస్తోంది.

ఈ ఘటనపై డాక్టర్ కోమి వ్యాస్ స్నేహితులు, సన్నిహితులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఉదయపూర్‌లోని తన ఉద్యోగాన్ని వదిలి, తన ముగ్గురు పిల్లలతో కలిసి లండన్‌కు తన భర్తతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి వెళుతోంది. ఈరోజు కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో వారంతా ఉన్నారు. అంటూ ఆమె ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో కన్నీటి పర్యంతమై పోస్టులు చేస్తున్నారు. కొత్త ఆరంభాల అంచున ఉన్న కుటుంబం.. కొన్నిసార్లు జీవితం చాలా అనిశ్చితంగా, క్రూరంగా ఉంటుంది. అంటూ తమ ఆవేదన వెలిబుచ్చుతున్నారు.

రాజస్థాన్‌లోని బన్స్వారా నుండి ఇది ఒక హృదయ విదారకమైన ఘటన. డాక్టర్ కోమి వ్యాస్ ఇటీవలే పసిఫిక్ ఆసుపత్రిని విడిచిపెట్టి తన భర్త ప్రదీప్ జోషితో కలిసి లండన్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సమాయత్తమయ్యారు.ఈరోజు, వారు తమ పిల్లలతో లండన్‌కు బయలుదేరారు. ఇంతలోనే విమాన ప్రమాదంలో విషాదకరమైన ముగింపును ఎదుర్కొన్నారు. అంటూ మరో సన్నిహితులు పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

లక్షలు ఆర్జిస్తున్న ఆటో డ్రైవర్ జీవితం తలకిందులు.. వీడియో వైరల్ కావడంతో షాక్

ఒక్క బిడ్డను పెంచేందుకు ఏడాదికి రూ.13 లక్షల ఖర్చు.. నెట్టింట భారీ చర్చ

Read Latest and Viral News

Updated Date - Jun 12 , 2025 | 10:12 PM