TNCC: హైకమాండ్ అనుమతి లేకుండా ఏదీ అడగలేం..
ABN, Publish Date - Jul 11 , 2025 | 11:18 AM
తమ హైకమాండ్ అనుమతి లేకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎక్కువ సీట్లు కోరలేమని టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై(TNCC President Selvaperunthagai) అన్నారు.
- టీఎన్‌సీసీ చీఫ్ సెల్వ పెరుంతగై
చెన్నై: తమ హైకమాండ్ అనుమతి లేకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎక్కువ సీట్లు కోరలేమని టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై(TNCC President Selvaperunthagai) అన్నారు. రాయపేటలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం సత్యమూర్తి భవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2026లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సమాయాత్తమవుతోందన్నారు. ఇందులోభాగంగా గ్రామ కమిటీ శిక్షణ ప్రధాన నిర్వాహకులుగా వంద మందిని ఎంపిక చేసిన వారికి శిక్షణ ఇస్తున్నామన్నారు.
వీరు రాష్ట్రంలోని 12,525 పంచాయతీల్లో ఉన్న నిర్వాహకులకు శిక్షణ ఇస్తారన్నారు. అలాగే, గ్రామ కమిటీ సభ్యుల ఎంపిక 72 శాతం మేరకు పూర్తయిందన్నారు. అలాగే, గ్రామ కమిటీ సభ్యులకు కొత్త గుర్తింపు కార్డులను జారీ చేస్తామన్నారు. డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ అధిక సీట్లను కోరే విషయంలో ఏమాత్రం వెనుకంజ వేయడం లేదన్నారు. అయితే, అధిక సీట్లను కోరడం అనేది తమ పార్గీ అగ్రనాయకత్వం అనుమతి మేరకే జరుగుతుందన్నారు.
అదేసమయంలో రాష్ట్రంలో తమ పార్టీ బలంగా ఉందన్న విషయాన్ని, కార్యకర్తల మనోభావాలను హైకాండ్‌కు తెలియజేస్తామన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత హయాంలోనే ఆలయ నిధులతో విద్యా సంస్థలను స్థాపించగా, ఇపుడు మంత్రి శేఖర్‌బాబు దాన్ని కొనసాగిస్తున్నారన్నారు. అన్నాడీఎంకే ద్రావిడ పార్టీ కాదన్నారు. జయలలితను కించపరిచేలా మాట్లాడిన వారితో ఆ పార్టీ పొత్తు పెట్టుకుందని ఆయన ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం కొనాలనుకునే వారికి షాక్.. పెరిగిన బంగారం ధరలు..
నకిలీ పోలీసుల ముఠా గుట్టు రట్టు
Read Latest Telangana News and National News
Updated Date - Jul 11 , 2025 | 11:18 AM