Gold And Silver Rate: బంగారం కొనాలనుకునే వారికి షాక్.. పెరిగిన బంగారం ధరలు..
ABN , Publish Date - Jul 11 , 2025 | 07:27 AM
Gold And Silver Rate: నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,200 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,400 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 73,800 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.
బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాల వారికి షాకిస్తున్నాయి. ఓ రోజు తగ్గి.. మూడు రోజులు పెరుగుతున్నాయి. గత నెలలో 94 వేల దగ్గర ట్రేడ్ అయిన స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు 98 వేల దగ్గర ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ ధర 3300 డాలర్లు పైనే ఉంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే.. ఈ సంవత్సరం బంగారం ధరలు 37.63 శాతం పెరిగాయి. గత 28 రోజుల పరిస్థితి చూసుకుంటే.. బంగారం ధరలు 70 శాతం పెరిగాయి.
బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్ నగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,200 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,400 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 73,800 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,410 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,210 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 73,810 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
విజయవాడ: 98,400
రాజమండ్రి: 98,400
విశాఖపట్నం: 98,336
చెన్నై: 98,400
హైదరాబాద్: 98,400
ముంబై: 98,400
బెంగళూరు: 98,400
కోల్‌కతా: 98,400
కేరళ: 98,400
పుణె: 98,400
అహ్మదాబాద్: 98,450
న్యూఢిల్లీ: 98,550
వెండి ధరలు ఇలా ..
బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతీ రోజు ఎంతో కొంత తగ్గుతూ వస్తున్నాయి. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 12,000 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,20,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాముల వెండిపై 10 రూపాయలు, కేజీ వెండిపై 100 రూపాయలు తగ్గింది. 100 గ్రాముల వెండి ధర నేడు 11,990 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర 1,19,900 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇవి కూడా చదవండి
శివాలయంపై గుర్తుతెలియని దుండగుల దాడి