Hyderabad: శివాలయంపై గుర్తుతెలియని దుండగుల దాడి
ABN , Publish Date - Jul 11 , 2025 | 05:56 AM
హైదరాబాద్‌లోని గాజులరామారం డివిజన్ కైసర్‌నగర్ శివాలయంపై బుధవారం గుర్తుతెలియని దుండగులు దాడి చేసి విగ్రహాలను ధ్వంసం చేశారు.
నిరసన వ్యక్తం చేసిన హిందూ సంఘాలు
గాజులరామారం, జూలై 10 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని గాజులరామారం డివిజన్ కైసర్‌నగర్ శివాలయంపై బుధవారం గుర్తుతెలియని దుండగులు దాడి చేసి విగ్రహాలను ధ్వంసం చేశారు. ఆలయంలోని వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో పాటు నందీశ్వరుడి పై ఉన్న వస్త్రాన్ని కాల్చేశారు. గుడి గంటను పగులగొట్టారు. ఈ ఘటనను హిందు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. గురువారం కైసర్‌నగర్ హనుమాన్ దేవాలయం నుంచి శివాలయం వరకు శాంతి ర్యాలీ నిర్వహించాయి. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను దెబ్బతీసే విధంగా ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
గాంధీనగర్ శివాలయంపై దాడి చేసి 100 రోజులు గడవక ముందే కైసర్‌నగర్ శివాలయంలోని దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేయడం దారుణమని, ఇలాంటి ఘటనలు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని అన్నారు. నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ ఏసీపీ శంకర్‌రెడ్డి, సూరారం సీఐ భరత్‌కుమార్, దుండిగల్ డీఐ సతీశ్, సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని, ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏసీపీ శంకర్‌రెడ్డి తెలిపారు. ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే వారిని పట్టుకుని కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
గొంతు నొప్పిని తగ్గించే సింపుల్ చిట్కా..
ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి
Read Latest Telangana News and National News