Tesla Showroom Rents: ఇండియాలో టెస్లా షోరూమ్స్ అద్దె ఎంతంటే..
ABN, Publish Date - Jun 21 , 2025 | 09:19 PM
టెస్లా.. ప్రపంచ దిగ్గజ ఈవీ ఆటో సంస్థ ఇండియాలో ఏర్పాటు చేయబోతున్న షోరూమ్స్ విషయానికొస్తే, వాణిజ్య రాజధాని ముంబైలో అదీ.. అత్యంత ఖరీదైన ప్రాంతంలో.. మరి వాటి రెంట్స్, అడ్వాన్సెస్, లీజులు ఏ స్థాయిలో ఉంటాయన్నది అందరికీ ఆశ్చర్యకరమే కదా..
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ సంస్థ టెస్లా ఇండియాలో అరంగేట్రం చేస్తోంది. ఇప్పటికే దీని గురించి ఆటో రంగంతోపాటు, జనాల్లోనూ ఉత్సుకత మొదలైంది. మరో నెలలో (జూలై 2025) నాటికి భారతదేశంలో తన మొదటి విడత షోరూమ్‌లను ప్రారంభించేందుకు టెస్లా సిద్ధమవుతోంది. యావత్ ప్రపంచంలోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV) దిగ్గజమైన టెస్లా, ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌లోకి అధికారికంగా ప్రవేశించబోతోందన్నమాట.
ఇక, మరో లావాదేవీలో ముంబై నార్త్ అవెన్యూలోని మేకర్ మాక్సిటీ అనే కమర్షియల్ కాంప్లెక్స్‌లో కూడా టెస్లా.. షోరూమ్ స్థలాన్ని అద్దెకు తీసుకుంది. ఈ స్థలాన్ని టెస్లా కంపెనీ దాదాపు రూ. 35 కోట్ల నెలవారీ అద్దెకు తీసుకుంది. ఈ డీల్ ఫిబ్రవరి 27, 2025న ఆస్తి యజమాని అయిన యూనివ్కో ప్రాపర్టీస్ ఇంకా, టెస్లా ఇండియా మోటార్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య రిజిస్టర్ అయిందని ఈ డీల్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు చూపిస్తున్నాయి. ఇక, ఈ స్థలానికి సంబంధించి లీజు కాలపరిమితి ఫిబ్రవరి 16, 2025న ప్రారంభమైందని.. అద్దె రహిత కాలం ఫిబ్రవరి 16 నుండి మార్చి 31 వరకు ఉంది. ఇక, లీజు ఒప్పందంలో భాగంగా అద్దె ఏప్రిల్ 2025 నుండి ఫిబ్రవరి 2030 వరకు చెల్లించబడుతుంది. ఇక, ఈ లావాదేవీకి సెక్యూరిటీ డిపాజిట్ రూ. 2.11 కోట్లు. దీంతోపాటు, అద్దె ఒప్పందంలో ప్రతి ఏడాదీ వార్షిక ప్రాతిపదికన నెలకు 5% అద్దె పెరుగుదల నిబంధన ఉంది. ఈ లెక్కన చూస్తే, మొదటి ఏడాది నెలకు అద్దె రూ. 35.26 లక్షలు, రెండవ సంవత్సరంలో రూ. 37.02 లక్షలు, మూడవ సంవత్సరంలో రూ. 38.88 లక్షలు, నాల్గవ సంవత్సరంలో రూ. 40.82 లక్షలు ఇక, ఐదవ సంవత్సరంలో రూ. 42.86 లక్షలుగా ఉండబోతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
సిట్ ముందుకు ప్రణీత్ రావు.. 650 ఫోన్ల ట్యాప్‌పైనే విచారణ
యోగా డేలో తొక్కిసలాట.. స్పృహకోల్పోయిన యువతి
భార్యపై అనుమానం.. బిడ్డలపై ఘాతుకం... రవిశంకర్ అరెస్ట్
Read latest Telangana News And Telugu News
Updated Date - Jun 21 , 2025 | 09:32 PM