ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rangaswami: కొవిడ్‌పై ముందస్తు చర్యలు చేపడుతున్నాం...

ABN, Publish Date - Jun 04 , 2025 | 01:43 PM

కొవిడ్‌పై ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాపించకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు. ముందు జాగ్రత్తతోనే కోవిడ్‏ను ఎదుర్కోగలమని ఆయన అన్నారు.

  • పుదువై సీఎం రంగస్వామి

పుదుచ్చేరి: కొవిడ్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందని పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి(N. Rangaswami) పేర్కొన్నారు. తమినాడు మాజీముఖ్యమంత్రి కరుణానిధి 102 జయంతిని పురస్కరించుకుని పుదుచ్చేరి ప్రభుత్వం తరుఫున వేడుకలు నిర్వహించారు. పుదుచ్చేరి బీచ్‌ రోడ్డులో వున్న మేరీ హాలులో కరుణానిధి(Karunanidhi) చిత్రపటానికి సీఎం రంగస్వామి నివాళులర్పించారు.


ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మూడేళ్ళ క్రితం ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మహమ్మారి ఈ రాష్ట్రంలో వ్యాపించకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు. ప్రజలు మాస్కు ధరించాల్సిన అవసరం లేదని, ఒకవేళ కరోనా బారినపడిన వారికి చికిత్స అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు సిద్ధం చేసినట్లు తెలిపారు. కేంద్రప్రభుత్వ సూచనలు పాటిస్తూ ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని రకాల వసతులు కల్పించినట్లు తెలిపారు.


ప్రస్తుతం ఎండలు మండుతున్న కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించాలని పలు రాజకీయ పార్టీల నేతలు కోరుతున్నారని, దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. సీఎంతో పాటు మంత్రులు లక్ష్మీనారాయణన్‌, సాయిశరవణకుమార్‌, ప్రతిపక్షనేత శివ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రాజవేలు, ఎమ్మెల్యేలు కెనడి, సంపత్‌, సెంథిల్‌కుమార్‌, కేఎ్‌సపీ రమేష్‌, భాస్కర్‌ తదితరులు కూడా కరుణానిధి చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

అమెరికాలో తెలుగు విద్యార్థులకు అండగా ఉంటాం

బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం ఖాయం

Read Latest Telangana News and National News

Updated Date - Jun 04 , 2025 | 03:46 PM